Telugu Global
NEWS

టీఆర్ఎస్ నేతలే బీజేపీ బలం....

qటీఆర్ఎస్ కారు ఇప్పుడు ఓవర్ ఫ్లో అయ్యి భారంగా నడుస్తోంది. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ గెలవగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. ఇక అధికారం కోసం కాంగ్రెస్, టీడీపీ…. ఇలా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి గులాబీ పార్టీలో చేరారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ కారుపార్టీని ఇదే కలవరపెడుతోంది. టీఆర్ఎస్ లో ఇప్పుడు… మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు నలుగురు గులాబీ టికెట్లు కావాలని పోటీపడుతున్నారు. […]

టీఆర్ఎస్ నేతలే బీజేపీ బలం....
X

qటీఆర్ఎస్ కారు ఇప్పుడు ఓవర్ ఫ్లో అయ్యి భారంగా నడుస్తోంది. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ గెలవగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. ఇక అధికారం కోసం కాంగ్రెస్, టీడీపీ…. ఇలా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి గులాబీ పార్టీలో చేరారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ కారుపార్టీని ఇదే కలవరపెడుతోంది.

టీఆర్ఎస్ లో ఇప్పుడు… మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు నలుగురు గులాబీ టికెట్లు కావాలని పోటీపడుతున్నారు. ఇందులో టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన వారు కొందరైతే టిఆర్ఎస్ పార్టీలో ఆది నుంచి ఉన్న వాళ్లు కూడా మరికొందరు.

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు వేళయ్యింది. మరిప్పుడు పార్టీ జెండా మోసిన, పార్టీని నమ్ముకున్న వాళ్లకు టీఆర్ఎస్ టికెట్లు ఇస్తారా.. అధికారం లోకి వచ్చాక టిఆర్ఎస్ లోకి జంప్ చేసిన ఇతర పార్టీ నేతలకు టికెట్లు ఇస్తారా అనే విషయంపైనే గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

అయితే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ లోకి ఇతర పార్టీల నుంచి గతంలో పెద్ద ఎత్తున కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వచ్చి చేరారు. ఇప్పుడు వారిని కాదన లేని పరిస్థితి. అలా అని ఆదినుంచి టిఆర్ఎస్ ను నమ్ముకున్ననేతలకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితిని కేటీఆర్ ఎదుర్కొంటున్నారు.

తాజాగా సిరిసిల్ల లో పర్యటించిన కేటీఆర్ మున్సిపాలిటీ లో టికెట్ల విషయంపై సర్వే చేయిస్తామని.. ఆ సర్వే ప్రకారం గెలిచే వారికే టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. టికెట్లు దక్కని వారు ఆవేశపడి బీజేపీలోకి, కాంగ్రెస్ లోకి వెళ్లవద్దని సూచించారు. తామే అధికారంలో ఉన్నాం కాబట్టి భవిష్యత్ లో నామినేటెడ్ పదవులు సహా కార్పొరేషన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ లో టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. సర్వేలో తమ పేరు రాకపోతే ఏం చేయాలని ఇప్పుడు నేతలంతా ఆలోచిస్తున్నారు. అయితే వారందరి చూపు బిజెపి వైపే మళ్లుతోంది. టికెట్ దక్కని టిఆర్ఎస్ నాయకులు అందరూ బిజెపిలో చేరి పోటీ చేద్దామని భావిస్తున్నారట.

ఇక బిజెపి కూడా తక్కువ తినలేదు…. టీఆర్ఎస్ లోని అసంతృప్తులు, టికెట్లు రాని వారిని లక్ష్యంగా చేసుకొని టికెట్లు ఇచ్చి వారి బలంతోనే టీఆర్ఎస్ ను ఓడించడానికి తాజాగా స్కెచ్ గీశారు.

టీఆర్ఎస్ లోని ఓవర్ ఫ్లో నాయకుల వల్ల ఆ పార్టీ పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ రెబల్స్ అంతా బిజెపిలో చేరి టిఆర్ఎస్ ను ఓడించడానికి రెడీ కావడం గులాబీ పార్టీ పాలిట శాపంగా .. బిజెపి పాలిట వరంగా మారుతోంది.

First Published:  22 July 2019 3:30 PM IST
Next Story