మొన్న చైనా... ఇప్పుడు యూఎస్.. ఇమ్రాన్‌కు ఘోర అవమానం
పాకిస్థాన్ పట్ల ప్రపంచ దేశాలు ఏమంతా సీరియస్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. పాకిస్థాన్ ప్రధాని వెళ్లినా సరే కనీసం విదేశాల్లో స్వాగతం కూడా సరిగా లభించడం లేదు. ఆ మధ్య చైనాకు ఇమ్రాన్ ఖాన్ వెళ్లగా…బీజింగ్ మున్సిపాలిటీకి చెందిన ఒక జూనియర్ ఆఫీసర్ మాత్రమే వచ్చి స్వాగతం పలికారు. ప్రోటోకాల్ ప్రకారం కనీసం చైనా మంత్రులు కూడా స్వాగతం పలికేందుకు రాలేదు. తాజాగా మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ వాషింగ్టన్ వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం […]
పాకిస్థాన్ పట్ల ప్రపంచ దేశాలు ఏమంతా సీరియస్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. పాకిస్థాన్ ప్రధాని వెళ్లినా సరే కనీసం విదేశాల్లో స్వాగతం కూడా సరిగా లభించడం లేదు.
ఆ మధ్య చైనాకు ఇమ్రాన్ ఖాన్ వెళ్లగా…బీజింగ్ మున్సిపాలిటీకి చెందిన ఒక జూనియర్ ఆఫీసర్ మాత్రమే వచ్చి స్వాగతం పలికారు. ప్రోటోకాల్ ప్రకారం కనీసం చైనా మంత్రులు కూడా స్వాగతం పలికేందుకు రాలేదు.
తాజాగా మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ వాషింగ్టన్ వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం ఒక దేశ ప్రధాని వస్తే… విదేశాంగ మంత్రి లేదంటే మరో మంత్రి వెళ్లి స్వాగతం పలకడం అనవాయితీ.
కానీ ఇమ్రాన్ ఖాన్‌కు స్వాగతం పలికేందుకు ఒక్క అమెరికా మంత్రి కూడా రాలేదు. అమెరికా అధికారులు కూడా ఎయిర్‌పోర్టుకు రాలేదు. కేవలం పాక్ దౌత్యాధికారులే ఇమ్రాన్ ఖాన్‌కు స్వాగతం పలికారు. ఇమ్రాన్ ఖాన్ తన బస కూడా పాక్ రాయబారి అధికారిక నివాసంలోనే ఏర్పాటు చేసుకున్నారు. తన పర్యటనలో ఇమ్రాన్ ఖాన్… ట్రంప్‌తో భేటీ కానున్నారు.