Telugu Global
Cinema & Entertainment

100 కోట్లతో పూరి 'జన గణ మన' ?

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఈ సినిమా ని పక్కన పెడితే పూరి జగన్నాథ్ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘జనగణమన’ అనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ సినిమా చేయలేకపోయాడు. అయితే ఇన్నాళ్ల తర్వాత పూరీ […]

100 కోట్లతో పూరి జన గణ మన ?
X

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది.

ఈ సినిమా ని పక్కన పెడితే పూరి జగన్నాథ్ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘జనగణమన’ అనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ సినిమా చేయలేకపోయాడు.

అయితే ఇన్నాళ్ల తర్వాత పూరీ జగన్నాథ్ మళ్ళీ ‘జనగణమన’ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అయితే మహేష్ బాబు పై పూరి జగన్నాథ్ ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘జనగణమన’ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో నే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. కానీ ఆ హీరో పేరు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని పూరి జగన్నాథ్ స్వయంగా 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మించనున్నారని టాక్.

First Published:  22 July 2019 6:44 AM IST
Next Story