వైసీపీకి పడ్డ ఓట్లలో 20 శాతం మావే...
ఏపీలో బీజేపీ నేతల ఆరాటం అంతా ఇంతా కాదు. ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు డిపాజిట్లు తెచ్చుకోలేకపోయినా…. వచ్చేసారి అధికారం మాదే అంటోంది బీజేపీ. ఆర్థిక నేరాల్లో ప్రమేయం ఉన్న టీడీపీ నేతలంతా తన బండిలో ఎక్కించుకుని … మేం బలపడ్డాం… టీడీపీ స్థానం మాదే… వైసీపీని ఓడించేది మేమే అంటూ నిత్యకోతలు కోస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణకు తొందర మరింత ఎక్కువైపోయి… ఇంకా నియామకాలే జరగని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అవినీతిమయం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ బీజేపీ […]
ఏపీలో బీజేపీ నేతల ఆరాటం అంతా ఇంతా కాదు. ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు డిపాజిట్లు తెచ్చుకోలేకపోయినా…. వచ్చేసారి అధికారం మాదే అంటోంది బీజేపీ.
ఆర్థిక నేరాల్లో ప్రమేయం ఉన్న టీడీపీ నేతలంతా తన బండిలో ఎక్కించుకుని … మేం బలపడ్డాం… టీడీపీ స్థానం మాదే… వైసీపీని ఓడించేది మేమే అంటూ నిత్యకోతలు కోస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణకు తొందర మరింత ఎక్కువైపోయి… ఇంకా నియామకాలే జరగని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అవినీతిమయం అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి పడ్డ ఓట్లలో 20 శాతం తమ ఓట్లేనని చెప్పుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారని అభిప్రాయపడ్డారు.