అమెరికాలో ఆ నటుడ్ని చితకబాదారు
అతడు ఆషామాషీ నటుడు కాదు. తెలుగు చిత్రసీమలో ఆయన కామెడీకి ఓ బ్రాండ్ ఉంది. అలాంటి నటుడికి అమెరికాలో దేహశుద్ధి జరిగింది. రీసెంట్ గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాడు ఆ సీనియర్ నటుడు. అది కూడా ప్రధాన కార్యక్రమం కాదు. దానికి అనుబంధంగా ఏర్పాటుచేసిన ఓ కాంపిటిషన్. ఆ పోటీలో న్యాయనిర్ణేతగా అతడ్ని ఆహ్వానించారు. పెద్దాయన కాబట్టి కాంపిటిషన్ కు కాస్త వాల్యూ పెరుగుతుందని భావించారు. రానుపోను ప్రయాణ […]
అతడు ఆషామాషీ నటుడు కాదు. తెలుగు చిత్రసీమలో ఆయన కామెడీకి ఓ బ్రాండ్ ఉంది. అలాంటి నటుడికి అమెరికాలో దేహశుద్ధి జరిగింది. రీసెంట్ గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాడు ఆ సీనియర్ నటుడు. అది కూడా ప్రధాన కార్యక్రమం కాదు. దానికి అనుబంధంగా ఏర్పాటుచేసిన ఓ కాంపిటిషన్. ఆ పోటీలో న్యాయనిర్ణేతగా అతడ్ని ఆహ్వానించారు. పెద్దాయన కాబట్టి కాంపిటిషన్ కు కాస్త వాల్యూ పెరుగుతుందని భావించారు. రానుపోను ప్రయాణ టిక్కెట్లతో పాటు బస కూడా ఏర్పాటుచేశారు.
విమానాశ్రయంలో సదరు నటుడికి ఆహ్వానం పలికేందుకు ఓ ఎన్నారై అమ్మాయిని ఏర్పాటుచేశారు. సీనియర్ యాక్టర్ కావడంతో చేస్తున్న పెద్ద ఉద్యోగానికి లీవ్ పెట్టి మరీ ఆహ్వానించేందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లింది ఆ అమ్మాయి. అయితే అతడు అమ్మాయిలతో కాస్త తేడాగా వ్యవహరిస్తాడనే విషయం ఆమెకు తెలియదు.
ఎయిర్ పోర్టులో నటుడు అడుగుపెట్టిన వెంటనే అంతా వెళ్లి ఆయన్ను కలిశారు. ఎన్నారై అమ్మాయితో బొకే ఇప్పించారు. అమ్మాయిని చూడగానే సదరు నటుడు తన అసలు రంగును బయటపెట్టాడు. సెట్స్ లో కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో ఎలా చీప్ గా ఉంటాడో, అలానే ప్రవర్తించాడు.
కానీ ఇక్కడున్నది జూనియర్ ఆర్టిస్టు కాదు. బాగా చదువుకొని, పెద్ద ఉద్యోగం చేస్తున్న ఓ ఎన్నారై మహిళ. నటుడి చేతిలో తనకు ఎదురైన చేదు అనుభవానికి ఆ అమ్మాయి కుంగిపోలేదు. తన సన్నిహితులు, కుటుంబ సభ్యులకు చెప్పింది.
ఇంకేముంది.. వెంటనే పది మంది గ్యాంగ్ తయారయ్యారు. అతడు పెద్ద నటుడని కూడా చూడకుండా, అతడు చేసిన పాడుపనికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంలో ఇతర ఎన్నారైలు, సంఘ సభ్యులు కూడా కలుగజేసుకోలేదు. కాకపోతే వ్యవహారం మీడియాకు, పోలీసుల వద్దకు వెళ్లకుండా మాత్రం ఆపగలిగారు.