Telugu Global
NEWS

విశాఖలో ఏపీ స్వాతంత్ర్య వేడుకలు

దేశ స్వాతంత్ర్య వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రాజధాని విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించింది. విశాఖపట్నంలోని ఆర్.కె. బీచ్ లో కాని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాని దేశ స్వాతంత్ర్య వేడుకులను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సమైక్య రాష్ట్ర్రంలో కాని, రాష్ట్ర్ర విభజన తర్వాత కాని విశాఖపట్నంలో దేశ స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించలేదని, ఇదే తొలిసారి అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి […]

విశాఖలో ఏపీ స్వాతంత్ర్య వేడుకలు
X

దేశ స్వాతంత్ర్య వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రాజధాని విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించింది. విశాఖపట్నంలోని ఆర్.కె. బీచ్ లో కాని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాని దేశ స్వాతంత్ర్య వేడుకులను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

సమైక్య రాష్ట్ర్రంలో కాని, రాష్ట్ర్ర విభజన తర్వాత కాని విశాఖపట్నంలో దేశ స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించలేదని, ఇదే తొలిసారి అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

విశాఖపట్నంలో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం విశాఖ వాసుల్లో ఆనందాన్ని కలుగజేస్తుందని మంత్రి అన్నారు.

“ఈ వేడుకలను విశాఖలో నిర్వహించడం ద్వారా పర్యాటకంగాను, పారిశ్రామికంగాను కూడా విశాఖపట్నానికి మరింత గుర్తింపు వస్తుంది” అని ఆయన చెప్పారు. స్వాతంత్ర్య వేడుకలను రాష్ట్ర్ర రాజధానికే పరిమితం చేయకూడదని ముఖ్యమంత్రి అలోచన అని, అందుకే విశాఖపట్నాన్ని ఎంపిక చేశారని పర్యాటక శాఖ మంత్రి తెలిపారు.

భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలలోనూ దేశ స్వాతంత్ర్య వేడుకలు, రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి యోచనని ఆయన చెప్పారు. దీని వల్ల తమకు అన్ని ప్రాంతాలు సమానమేననే భావనను ప్రజలలోకి తీసుకువెళ్లినట్టు అవుతుందని మంత్రి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అన్ని వర్గాల నుంచి ప్రసంశలు వస్తున్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చెప్పారు.

“గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకుడికే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎంత సేపు మాట్లాడితే అంత సేపు మాట్లాడేందుకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తున్నారు” అని మంత్రి తెలిపారు.

శానససభలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలు అర్ధవంతంగా ఉంటున్నాయని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు చెబుతున్నారని, ముఖ్యంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర్రంలో పర్యాటక రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఇతర రాష్ట్ర్రాలు, దేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని పర్యాటన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చెప్పారు.

First Published:  21 July 2019 5:27 AM IST
Next Story