రేపు ఏపీ వార్డు కార్యదర్శుల భర్తీకి నోటిఫికేషన్
పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్నిగ్రామాలలోను గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయానికి కార్యదర్శులను నియమించే పనిని ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర్ర వ్యాప్తంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లోని వార్డులకు కూడా కార్యదర్శులను నియమించే పనికి సోమవారం శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం వార్డు కార్యదర్శుల ఎంపికకు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. […]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్నిగ్రామాలలోను గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయానికి కార్యదర్శులను నియమించే పనిని ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర్ర వ్యాప్తంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు మున్సిపాలిటీల్లోని వార్డులకు కూడా కార్యదర్శులను నియమించే పనికి సోమవారం శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం వార్డు కార్యదర్శుల ఎంపికకు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
అక్టోబర్ రెండో తేదీ… మహాత్మాగాంధీ 150 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యదర్శుల పని ప్రారంభం అవుతుంది.
ఈలోగా గ్రామ కార్యదర్శులు, వార్డు కార్యదర్శుల ఎంపికతో పాటు వారికి శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3,775 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. వాటికి కార్యదర్శులను నియమించేందుకు సోమవారం నాడు నోటిఫికేషన్ విడుదల కానుంది.
ప్రతి నాలుగు వేల మందికి ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రతి వార్డుకు కనీసం 10 మంది కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వార్డు కార్డదర్శులుగా ఎంపికైన వారు వార్డులలో అక్రమ కట్టడాల నివారణ, పర్యావరణ పరిరక్షణ, మహిళా సంక్షేమం, పౌర సరఫరాలను ప్రజలకు నేరుగా అందించడం, జనన మరణాల నమోదు, విద్య, వైద్యం, రెవెన్యూ, సంక్షేమం వంటి శాఖలలో పనిచేస్తూ ప్రజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.
ఇప్పటి వరకూ మున్సిపాల్టీలలో 18 విభాగాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలుండేవి. వీటిని 10 శాఖలుగా కుదించి ఆయా శాఖల పని తీరును వార్డు కార్యదర్శులు పర్యవేక్షిస్తారు.
వార్డు కార్యదర్శులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వారికి అందజేస్తారు. ఇక వార్డు కార్యదర్శుల ఉద్యోగాలకు విద్యార్హతను ఆయా విభాగాలను బట్టి నిర్ణయిస్తారు. వార్డు కార్యదర్శుల ఎంపికను రాత పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు. వార్డు కార్యదర్శుల ఉద్యోగాలకు ఆగస్టు 5 వ తేదీ వరకూ దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీగా నిర్ణయించారు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం కార్యదర్శుల ఉద్యోగాలకు పరీక్షలను ఆగస్టు 16 వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకూ నిర్వహిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై రాత పరీక్షను నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అనంతరం వార్డు కార్యదర్శలను నియమిస్తారు. గ్రామ కార్యదర్శులకు ఇచ్చినట్లుగానే వార్డు కార్యదర్శులకు కూడా శిక్షణ ఇస్తారు.