Telugu Global
National

దక్కన్ క్రానికల్‌కు మేఘా లీగల్‌ నోటీసులు

దున్నపోతు ఈనిందంటే…. దూడను కట్టేయమన్నాడట మరొకడు…. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా అలా తయారయింది. సోషల్‌ మీడియాతో పోటీ పడుతూ ప్రధాన మీడియా కూడా మిగతా వాళ్ళ కన్నా వార్తలు త్వరగా ఇవ్వాలని తప్పటడుగులు వేస్తోంది. సెన్సేషనల్‌గా ఇవ్వాలని ప్రింట్‌ మీడియా, విజువల్‌ మీడియా కూడా అప్పుడప్పుడూ దారితప్పుతూ ఉన్నాయి. ఒక సంస్థ మీద దాడి జరిగిందంటే…. అధికారులను కానీ, ఆ సంస్థను కానీ కనీసం సంప్రదించకుండా గాలిలో వార్తలు సృష్టిస్తున్నారు. అలాంటి వార్త ఈరోజు దక్కన్‌ […]

దక్కన్ క్రానికల్‌కు మేఘా లీగల్‌ నోటీసులు
X

దున్నపోతు ఈనిందంటే…. దూడను కట్టేయమన్నాడట మరొకడు…. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా అలా తయారయింది. సోషల్‌ మీడియాతో పోటీ పడుతూ ప్రధాన మీడియా కూడా మిగతా వాళ్ళ కన్నా వార్తలు త్వరగా ఇవ్వాలని తప్పటడుగులు వేస్తోంది. సెన్సేషనల్‌గా ఇవ్వాలని ప్రింట్‌ మీడియా, విజువల్‌ మీడియా కూడా అప్పుడప్పుడూ దారితప్పుతూ ఉన్నాయి. ఒక సంస్థ మీద దాడి జరిగిందంటే…. అధికారులను కానీ, ఆ సంస్థను కానీ కనీసం సంప్రదించకుండా గాలిలో వార్తలు సృష్టిస్తున్నారు.

అలాంటి వార్త ఈరోజు దక్కన్‌ క్రానికల్‌ కూడా సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ‘మేఘా’ సంస్థ ఇన్‌కమ్‌టాక్స్‌, జీఎస్టీ లాంటి పన్నులను చెల్లించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అన్ని సంస్థల కన్నా అతి ఎక్కువగా, నిజాయితీగా పన్నులు చెల్లించిన రికార్డు మేఘాది. అలాగే ఉద్యోగుల విషయంలోనూ…. ఇన్ని వేల మంది ఉద్యోగులు మేఘాలో పనిచేస్తున్నా ఎప్పుడూ ఏవిధమైన వివాదాలకూ చోటివ్వని సంస్థ మేఘా.

అలాంటి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారన్న వార్తను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ శనివారం ప్రచురించింది. అసలు అది ఏమాత్రం వాస్తవం కాకపోయినా దాన్ని ప్రముఖంగా ప్రచురించడం జర్నలిజం నైతికతకే దెబ్బ. వార్తలో కనీస సమాచారం లేకుండా పూర్తిగా అవాస్తవాలను, ఊహాజనిత విషయాలను ప్రచురించారు.

కనీసమైన ధృవీకరణ లేకుండానే వార్తలను ప్రచురించడం కొన్ని అదృశ్య శక్తుల దురుద్దేశ్యాలను బట్టబయలు చేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ విధమైన ప్రచారం అధికం అయ్యింది. ముఖ్యంగా కొందరు ఉద్ధేశ్యపూర్వకంగా సామాజిక
మాధ్యమాల్లో మేఘా ఇంజినీరింగ్‌ పై ఐటీ, ఈడీ, జీఎస్టీ సంస్థలు దాడులు జరిపాయని కొన్ని సందర్భాల్లోనూ, జరగబోతున్నాయని మరికొన్ని సందర్భాల్లోనూ కక్ష పూరితంగా విషప్రచారం చేస్తున్నారు.

అవి మౌఖికంగా వ్యాప్తి చెందుతుండటంతో మీడియా సంస్థల ప్రతినిధులు కూడా వాటి ప్రభావానికి ఎంతో కొంత లోనవుతున్నట్టు కనిపిస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిందని ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే అనేక వార్తలను దాని చుట్టూ అల్లి ప్రచురించాయి.

ఆ నేపథ్యంలోనే జీఎస్టీ దాడులంటూ అనవసరపు హడావిడిని సృష్టించాలన్న ప్రయత్నం ఆంగ్ల దినపత్రిక చేసింది. ఇలాంటి వార్తలు పునరావృతం కాకుండా ఉండేందుకు మేఘా కంపెనీ ఆంగ్ల పత్రికపై చట్ట పరమైన చర్యలను తీసుకునేందుకు సిద్ధమైందని చెబుతున్నారు.

ఇలాంటి గాలి వార్తలు ప్రచురించకుండా మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలే సరైన మార్గంగా భావించింది మేఘా.
ఈ సంస్థ పన్ను సంబంధిత చట్టాలను ఎప్పుడూ అతిక్రమించలేదు. గత రెండు సంవత్సరాల్లో పన్ను చెల్లింపుదారుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కెల్లా ఎక్కువ జీఎస్టీని చెల్లించిన సంస్థ మేఘానే. జీఎస్టీ వచ్చాక ఈ కంపెనీ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లింపులను చేసింది.

దేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఇన్ ఫ్రా సంస్థల్లో ఒకటిగా మేఘా నిలుస్తూ ఉంది. పన్ను చట్టాలను ఎప్పుడూ ఈ సంస్థ గౌరవిస్తుంది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి అంశాల్లో పురోగమన దశలో ఉన్న సంస్థలపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రభావం చూపిస్తాయి. ఎలాంటి నిజనిర్ధారణ లేకుండా కొందరు అలాంటి ప్రచారాలను చేస్తూ ఉన్నారు.

మేఘాపై తప్పుడు కథనాలతో అనుచితమైన, అనవసరమైన ప్రచారానికి పాల్పడిన దక్కన్ క్రానికల్ పై మేఘా చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతోంది.

First Published:  20 July 2019 10:12 AM IST
Next Story