Telugu Global
NEWS

దీని పేరే పారదర్శకత... ఏపీ హోంమంత్రిని లెక్కచేయలేదు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అధికార బదిలీల్లో మంత్రుల మాట కూడా నెగ్గలేదు. మంత్రుల సిఫార్సులను కూడా అధికారులు పట్టించుకోకుండా ముందుకెళ్లారు. అంతా పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో మంత్రులు ఒత్తిడి తెచ్చినా సరే అధికారులు డోన్ట్ కేర్‌ అంటూ ముందుకెళ్లారు. చివరకు హోంమంత్రి మేకతోటి సుచరిత సిఫార్సు తన సొంత జిల్లాలోనే పనిచేయలేదు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ లో బదిలీ సందర్బంగా కీలకస్థానాలు దక్కించుకునేందుకు పెద్దెత్తున ఉద్యోగులు లాబీయింగ్‌లు చేశారు. ఇందులో భాగంగా టౌన్ […]

దీని పేరే పారదర్శకత... ఏపీ హోంమంత్రిని లెక్కచేయలేదు
X

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అధికార బదిలీల్లో మంత్రుల మాట కూడా నెగ్గలేదు. మంత్రుల సిఫార్సులను కూడా అధికారులు పట్టించుకోకుండా ముందుకెళ్లారు. అంతా పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో మంత్రులు ఒత్తిడి తెచ్చినా సరే అధికారులు డోన్ట్ కేర్‌ అంటూ ముందుకెళ్లారు. చివరకు హోంమంత్రి మేకతోటి సుచరిత సిఫార్సు తన సొంత జిల్లాలోనే పనిచేయలేదు.

ప్రభుత్వం మారిన నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ లో బదిలీ సందర్బంగా కీలకస్థానాలు దక్కించుకునేందుకు పెద్దెత్తున ఉద్యోగులు లాబీయింగ్‌లు చేశారు. ఇందులో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారి ఒకరు హోంమంత్రిని ఆశ్రయించారు. తన స్థానాన్ని కాపాడుకునేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు సదరు అధికారి. వెంటనే కమిషనర్‌తో మాట్లాడిన హోంమంత్రి సుచరిత… టౌన్ ప్లానింగ్ అధికారి విషయంలో సహకరించాలని కోరారు.

కానీ హోంమంత్రి సిఫార్సును కమిషనర్‌ పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్లారు. అధికారి పోస్టింగ్ కాపాడేందుకు హోంమంత్రి ఒక్కరే కాకుండా ఆమె కుటుంబసభ్యులు కూడా కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. దాంతో కమిషనర్ హోంమంత్రి సిఫార్సును పక్కనపడేసినట్టు తెలుస్తోంది.

ఈ పరిణామంతో సన్నిహితుల వద్ద సుచరిత ఆవేదన చెందారు. సొంత జిల్లాలో ఒక అధికారి పోస్టింగ్ విషయంలోనూ తన మాట లెక్క చేయకపోవడం ఏమిటని ఆవేదన చెందారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం అండ ఉండడంతో కమిషనర్‌ … హోంమంత్రిని కూడా లెక్క చేయలేదన్న చర్చ నడుస్తోంది.

First Published:  20 July 2019 5:06 AM IST
Next Story