Telugu Global
Cinema & Entertainment

అప్పుడు కవచం.... ఇప్పుడు రాక్షసుడు

యాక్షన్ ఇమేజ్ కోసం పరితపించే హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. యాక్టింగ్ లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ అది వదిలేసి, యాక్షన్ సినిమాల్ని ఎప్పటికప్పుడు సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా బెల్లంకొండ చేస్తున్న మరో మూవీ రాక్షకుడు. ఈ సినిమా ట్రయిలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు బెల్లంకొండ. నిజానికి బెల్లంకొండకు పోలీస్ పాత్ర కొత్తకాదు. గతంలో కవచం సినిమాలో అతడు ఇదే పాత్ర పోషించాడు. కానీ ఆ సినిమా ఫెయిల్ అయింది. […]

అప్పుడు కవచం.... ఇప్పుడు రాక్షసుడు
X

యాక్షన్ ఇమేజ్ కోసం పరితపించే హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. యాక్టింగ్ లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ అది వదిలేసి, యాక్షన్ సినిమాల్ని ఎప్పటికప్పుడు సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా బెల్లంకొండ చేస్తున్న మరో మూవీ రాక్షకుడు. ఈ సినిమా ట్రయిలర్ తాజాగా విడుదలైంది.

ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు బెల్లంకొండ. నిజానికి బెల్లంకొండకు పోలీస్ పాత్ర కొత్తకాదు. గతంలో కవచం సినిమాలో అతడు ఇదే పాత్ర పోషించాడు. కానీ ఆ సినిమా ఫెయిల్ అయింది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా రాక్షసుడు సినిమాకు సై అన్నాడు. రాక్షసుడిలో మరోసారి పోలీస్ గా కనిపిస్తున్నాడు.

తమిళ్ లో హిట్ అయిన రాట్ససన్ కు రీమేక్ గా వస్తోంది రాక్షసుడు. టైటిల్ నుంచి మేకింగ్ వరకు ఎక్కడా ఎలాంటి ప్రయోగాలు చేయకుండా.. తమిళ సినిమాను మక్కికి మక్కి దించేశారు. తమిళ వెర్షన్ చూసిన వాళ్లు, రాక్షసుడు ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది.

అలా ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ఈ రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ. కవచంతో కరుణించని ఖాకీచొక్కా.. రాక్షసుడు సినిమాతోనైనా కలిసొస్తుందేమో చూడాలి.

First Published:  19 July 2019 9:00 PM
Next Story