Telugu Global
NEWS

విద్యుత్‌ ఒప్పందాలపై దర్యాప్తు జరపాల్సిందే

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందేనని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సామాన్యులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ప్రాజెక్టులపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చగోష్టిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అంబటి రామక్రిష్ణ మాట్లాడుతూ పీపీఎలపై కచ్చితంగా దర్యాప్తు జరపాల్పిందేనని అన్నారు. 2014 సంవత్సరంలో సమైక్య రాష్ట్ర్రంలో మిగులు విద్యుత్ ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తానే మిగులు విద్యుత్ […]

విద్యుత్‌ ఒప్పందాలపై దర్యాప్తు జరపాల్సిందే
X

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందేనని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సామాన్యులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ప్రాజెక్టులపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చగోష్టిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అంబటి రామక్రిష్ణ మాట్లాడుతూ పీపీఎలపై కచ్చితంగా దర్యాప్తు జరపాల్పిందేనని అన్నారు.

2014 సంవత్సరంలో సమైక్య రాష్ట్ర్రంలో మిగులు విద్యుత్ ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తానే మిగులు విద్యుత్ కు మూలపురుషుడని మాట్లాడుతున్నారని అన్నారు. “గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై గోల్ మాల్ జరిగింది వాస్తవం. దర్యాప్తు ద్వారానే నిజాలు వెలుగులోకి వస్తాయి” అని అంబటి రామక్రిష్ణ అన్నారు.

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సచ్చీలతను నిరూపించుకోవాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంల విడిపోయిన తర్వాత పరిశ్రమల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే గడచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు.

“పరిశ్రమల కోసం విశాఖపట్నంలో సదస్సులు పెట్టారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు. దేశ ప్రజలందరికీ తెలుసు” అని కోటేశ్వరరావు వ్యంగ్యంగా అన్నారు.

విద్యుత్ ప్రాజెక్టులపై దర్యాపు చేయాల్పిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు గణేష్ అన్నారు. “మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. విద్యుత్ ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాల్సిందే. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి” అని గణేష్ అన్నారు.
చర్చలో పాల్గొన్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు తన పాలనలో మాయ చేసారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. “మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సచ్చీలతను నిరూపించుకునేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? దర్యాప్తు అంటే ఎందుకు భయపడుతున్నారు” అని ఆయన ప్రశ్నించారు.

ఇక టెలిఫోన్ ద్వారా చర్చలో పాల్గొన్న గుంటూరుకు చెందిన శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రెండు రూపాయలకు దొరికితే ఐదు రూపాయలకు ఎందుకు కొనుగోలు చేయాల్పి వచ్చిందని ప్రశ్నించారు. ” ఒక యూనిట్ కు మూడు రూపాయలు ఎక్కువ ఖర్చు చేసారు. అది మధ్యలో ఎవరికి చేరిందో తేలాలంటే దర్యాప్తు జరగాల్సిందే” అని అన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహేంద్ర చర్చగోష్టిలో మాట్లాడుతూ శాసనసభలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అన్యాయంగా, అసభ్యంగా ప్రవర్తిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన విద్యుత్ ప్రాజెక్టులపై దర్యాప్తు జరగాల్సిందేనని అన్నారు.

First Published:  20 July 2019 5:16 AM IST
Next Story