Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ కి, కో-డైరెక్టర్ కి... గొడవ?

టాలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఇది….  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రస్తుతం త్రివిక్రమ్ తో తీస్తున్న సినిమా కో-డైరెక్టర్ కి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. అయితే షూటింగ్ జరుగుతున్న సమయం లో ఇలా జరగడం వలన అది మరింత పెద్దది అయిందని ప్రచారం సాగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు ఈ సినిమా కి ఇండస్ట్రీ లో సీనియర్ కో-డైరెక్టర్ ఒకరు పని చేస్తున్నాడని టాక్. అయితే షూటింగ్ జరిగే సమయం […]

అల్లు అర్జున్ కి, కో-డైరెక్టర్ కి... గొడవ?
X

టాలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఇది…. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రస్తుతం త్రివిక్రమ్ తో తీస్తున్న సినిమా కో-డైరెక్టర్ కి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. అయితే షూటింగ్ జరుగుతున్న సమయం లో ఇలా జరగడం వలన అది మరింత పెద్దది అయిందని ప్రచారం సాగుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు ఈ సినిమా కి ఇండస్ట్రీ లో సీనియర్ కో-డైరెక్టర్ ఒకరు పని చేస్తున్నాడని టాక్. అయితే షూటింగ్ జరిగే సమయం లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగినదని, ఈ ఇష్యూ జరగడం వల్లనే షూటింగ్ కూడా ఆగిపోయిందని అంటున్నారు.

అయితే ఈ గొడవ షూటింగ్ స్పాట్ లో అందరి మధ్య జరగడంతో, అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటూ కో-డైరెక్టర్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేశాడట. అయితే ఈ గొడవ పెద్దది కాక ముందే త్రివిక్రమ్ మరియు సినిమా నిర్మాత కో డైరెక్టర్ ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారట.

అంతే కాకుండా అల్లు అర్జున్ ఇగో కూడా హర్ట్ అవ్వకుండా ఇష్యూ సాల్వ్ చేయాలనే భావన లో ఉందట సినిమా యూనిట్.

First Published:  20 July 2019 12:32 AM IST
Next Story