Telugu Global
National

ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సోంభద్ర ప్రాంతంలో ఒక భూవివాదం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 36 ఎకరాల విషయంలో ఉబ్బా గ్రామ పెద్దకు, రైతులకు మధ్య వివాదం ఉంది. ఆ భూమిని ఆక్రమించుకోవడానికి వెళ్తున్న గ్రామ పెద్దను… రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన గ్రామ పెద్ద అనుచరులు కాల్పులకు తెగబడటంతో 10 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో […]

ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
X

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సోంభద్ర ప్రాంతంలో ఒక భూవివాదం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 36 ఎకరాల విషయంలో ఉబ్బా గ్రామ పెద్దకు, రైతులకు మధ్య వివాదం ఉంది.

ఆ భూమిని ఆక్రమించుకోవడానికి వెళ్తున్న గ్రామ పెద్దను… రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన గ్రామ పెద్ద అనుచరులు కాల్పులకు తెగబడటంతో 10 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక గాంధీ బయలు దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మీర్జాపూర్ వద్ద అడ్డుకున్న పోలీసులు నారాయణపూర్‌ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ…. అన్యాయంగా రైతులను కాల్చి చంపారు. ఆ కుటుంబాలను పరామర్శించడానికి మాత్రమే నేను వెళ్తున్నాను. గాయపడిన వారిలో నా కొడుకు వయస్సున్న పిల్లాడు కూడా ఉన్నాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారిని పరామర్శించే బాధ్యత నాకు ఉంది. నన్ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? మేం శాంతియుతంగానే నిరసన తెలిపాం కదా… అని ప్రియాంక అన్నారు.

కాగా, సోంభద్ర ప్రాంతంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంకను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  19 July 2019 8:18 AM IST
Next Story