Telugu Global
NEWS

'ఒక రూపాయికే బిల్డింగ్ రిజిస్ట్రేషన్.... అక్రమమైతే నోటీసులు లేకుండానే కూల్చివేత'

తెలంగాణ రాష్ట్ర కొత్త మున్సిపల్ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ చట్టంలో పొందుపర్చిన అనేక విషయాలను సీఎం కేసీఆర్ సభలో వివరించారు. రాష్ట్రంలో ఇకపై నగర పంచాయితీలు ఉండవని కేవలం మున్సిపాలటీలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. 75 చదరపు గజాల లోపు నిర్మించే జీ+1 భవనాలకు అనుమతి అవసరం లేదని.. కేవలం 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు. మున్సిపాలిటీల్లో అవినీతిని సహించబోమన్నారు. అక్రమ కట్టడాలను ఎక్కడా అనుమతించమని.. ఏదైనా నిర్మాణం అక్రమమని తెలిస్తే […]

ఒక రూపాయికే బిల్డింగ్ రిజిస్ట్రేషన్.... అక్రమమైతే నోటీసులు లేకుండానే కూల్చివేత
X

తెలంగాణ రాష్ట్ర కొత్త మున్సిపల్ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ చట్టంలో పొందుపర్చిన అనేక విషయాలను సీఎం కేసీఆర్ సభలో వివరించారు. రాష్ట్రంలో ఇకపై నగర పంచాయితీలు ఉండవని కేవలం మున్సిపాలటీలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

75 చదరపు గజాల లోపు నిర్మించే జీ+1 భవనాలకు అనుమతి అవసరం లేదని.. కేవలం 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు. మున్సిపాలిటీల్లో అవినీతిని సహించబోమన్నారు. అక్రమ కట్టడాలను ఎక్కడా అనుమతించమని.. ఏదైనా నిర్మాణం అక్రమమని తెలిస్తే ఎటువంటి నోటీసులు లేకుండానే కూల్చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇక మున్సిపాలిటీలో ఆస్తి పన్నును కట్టకుండా లేదా తప్పుగా కడితే 25 రెట్ల జరిమానా విధిస్తామని చెప్పారు. మున్సిపాలిటీలకు పూర్తి నిధులు, అధికారాలు ఉంటాయి. కొన్ని అధికారాలు మాత్రం కలెక్టర్లకు కేటాయించామని సీఎం చెప్పారు.

ప్రతీ మున్సిపల్ వార్డులో ప్రజాదర్బారు ఉంటుందని.. ప్రజలకు అందుబాటులో అన్ని సేవలు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. మున్సిపల్ చట్టాన్ని పూర్తి పారదర్శకంగా రూపొందించామని ఆయన చెప్పారు.

First Published:  19 July 2019 7:53 AM IST
Next Story