Telugu Global
NEWS

బాపు పేరిట మ్యూజియం.... ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో ఉన్న పర్యాటక ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శాసనసభలోనూ, అనంతరం విలేకరుల సమావేశంలోను మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. గత పాలకులు పర్యాటక రంగాన్ని నిర్వీర్యం చేశారు” అని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో […]

బాపు పేరిట మ్యూజియం.... ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం
X

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో ఉన్న పర్యాటక ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శాసనసభలోనూ, అనంతరం విలేకరుల సమావేశంలోను మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు.

“ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. గత పాలకులు పర్యాటక రంగాన్ని నిర్వీర్యం చేశారు” అని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలలోనూ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, అయితే వాటికి తగిన గుర్తింపు, ప్రచారం కల్పిస్తే ఇతర ప్రాంతాల పర్యాటకులు రాష్ట్రానికి వస్తారని మంత్రి తెలిపారు.

ఇంత వరకూ విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలు, తిరుపతి పుణ్యక్షేత్రం మినహా మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయడం, మన పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించలేదని మంత్రి అవంతి ఆరోపించారు.

“విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కూడా పర్యాటక రంగంలో ప్రగతి సాధించాల్సి ఉంది” అని మంత్రి తెలిపారు. ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు పేరిట విజయవాడలో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, అతి త్వరలో ఈ మ్యూజియం ప్రారంభం అవుతుందని” మంత్రి చెప్పారు.

ఏలూరులో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని వచ్చే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని, ఇది ఉభయగోదావరి జిల్లాలకే తలమానికం అని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో ఏర్పాటుచేసిన రోప్ వే ను కూడా త్వరలో ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో కూడా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు.

First Published:  19 July 2019 4:10 AM IST
Next Story