బీజేపీలోకి.... ఏపీ మాజీ సీఎం !
ఏపీ బీజేపీలో మాజీలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు బీజేపీలో చేరారు. ఇప్పుడు మరో మాజీ సీఎం వంతు వచ్చింది. ఆయనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ విషయం అమరావతిలో చెప్పారు. ఆయనే కాదు టీడీపీ ఎమ్మెల్సీలు కూడా తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని…త్వరలో ఆ విషయంలో స్పష్టత వస్తుందని మాధవ్ వివరించారు. మాజీ సీఎం కిరణ్ […]
ఏపీ బీజేపీలో మాజీలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు బీజేపీలో చేరారు. ఇప్పుడు మరో మాజీ సీఎం వంతు వచ్చింది. ఆయనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ విషయం అమరావతిలో చెప్పారు. ఆయనే కాదు టీడీపీ ఎమ్మెల్సీలు కూడా తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని…త్వరలో ఆ విషయంలో స్పష్టత వస్తుందని మాధవ్ వివరించారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమతో టచ్‌లో ఉన్నారని మాధవ్ చెప్పుకొచ్చారు… ఫైనల్ గా చర్చలు ముగిస్తే ఆయన జంప్ అవుతారని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఆ పార్టీ తరపున ఆయన పెద్దగా ప్రచారం చేయలేదు. ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరు. పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం నుంచి పోటీ చేశారు. వైసీపీ నేత చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో కూడా కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం వైపు వెళ్లడం లేదు.
బీజేపీలో కిరణ్ చేరికతో జరిగే లాభం ఎంతో తెలియదు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పట్టు కోల్పోయారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన రాజకీయాలు చూసిన నేతలు కలిసివచ్చే పరిస్థితి లేదు. చాలా మంది కాంగ్రెస్ లీడర్లు పార్టీ మారారు. ఆయనకు టచ్‌లో కూడా లేకుండా పోయారు. దీంతో ఆయనతో పాటు కలిసి వచ్చే నేతలు ఇప్పుడు కనిపించడంలేదు.
ఏపీ రాజకీయాలకు ఎప్పుడో దూరమైన నేత బీజేపీలో చేరితే కండువా ఖర్చు తప్ప… మిగిలేది ఏం లేదనేది బీజేపీలోని ఓ సెక్షన్ వాదన. మొత్తానికి అవుడేటెడ్ లీడర్లతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ క్యాంపు నిండిపోతుందనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.