Telugu Global
NEWS

ప్రో-కబడ్డీ 7వ సీజన్ కు కౌంట్ డౌన్

గచ్చిబౌలీలో హైదరాబాద్ అంచెపోటీలు తెలుగు టైటాన్స్ హోమ్ గ్రౌండ్ గా హైదరాబాద్  జులై 20నుంచి హైదరాబాద్ లో 11 మ్యాచ్ లు వన్డే ప్రపంచకప్ ముగియడంతోనే…భారత దేశవాళీ క్రీడ కబడ్డీ లీగ్ 7వ సీజన్ పోటీలకు ..హైదరాబాద్ లోని గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. తెలుగు టైటాన్స్,యూ-ముంబై, పుణేరీ పల్టాన్, గుజరాత్ , పట్నా పైరేట్స్, బెంగళూరు, జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా, ఢిల్లీ, తమిళ్ తలైవాస్, యూపీ జట్లు తలపడుతున్న మూడుమాసాల ఈ హంగామాలోని […]

ప్రో-కబడ్డీ 7వ సీజన్ కు కౌంట్ డౌన్
X
  • గచ్చిబౌలీలో హైదరాబాద్ అంచెపోటీలు
  • తెలుగు టైటాన్స్ హోమ్ గ్రౌండ్ గా హైదరాబాద్
  • జులై 20నుంచి హైదరాబాద్ లో 11 మ్యాచ్ లు

వన్డే ప్రపంచకప్ ముగియడంతోనే…భారత దేశవాళీ క్రీడ కబడ్డీ లీగ్ 7వ సీజన్ పోటీలకు ..హైదరాబాద్ లోని గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

తెలుగు టైటాన్స్,యూ-ముంబై, పుణేరీ పల్టాన్, గుజరాత్ , పట్నా పైరేట్స్, బెంగళూరు, జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా, ఢిల్లీ, తమిళ్ తలైవాస్, యూపీ జట్లు తలపడుతున్న మూడుమాసాల ఈ హంగామాలోని తొలి అంచె పోటీకి …హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్ ఆతిథ్యమిస్తోంది.

టైటాన్స్ కు ఇరానీ ప్లేయర్ నాయకత్వం..

తెలుగు టైటాన్స్ జట్టు…ఇరానీ డిఫండర్ అబోజర్ మిఘానీ నాయకత్వంలో…గులాం రెజా చీఫ్ కోచ్ గా 7వ సీజన్ లీగ్ లో తన అదృష్టం పరీక్షించుకోనుంది.

లీగ్ లో పాల్గొంటున్న వివిధ జట్లు తమజట్లలో మార్పులు చేర్పులతో పాటు…లోగో ఆవిష్కరణ కార్యక్రమాలను సైతం ఘనంగా
ముగించాయి.

ఇవీ హైదరాబాద్ అంచె పోటీలు..

కబడ్డీ లీగ్ 7వ సీజన్ తొలి అంచె పోటీలకు తెలుగు టైటాన్స్ జట్టు ఆతిథ్యమిస్తోంది. జులై 20 నుంచి 26 వరకూ మొత్తం 11 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

  • జులై 20 న జరిగే ప్రారంభమ్యాచ్ లో తెలుగు టైటాన్స్ తో యూ-ముంబా ఢీ కొంటుంది. అదేరోజు జరిగే రెండోమ్యాచ్ లో బెంగళూరు, పట్నా జట్లు తలపడతాయి.
  • జులై 21న జరిగే పోటీలలో బెంగళూరుతో గుజరాత్, తెలుగు టైటాన్స్ తో తమిళ్ తలైవాస్ పోటీపడతాయి.
  • జులై 22న యూ-ముంబాతో జైపూర్, పూణేరీ పల్టాన్ తో హర్యానా తలపడతాయి.
  • జులై 24న జరిగే మ్యాచ్ ల్లో బెంగాల్ తో యూపీ, తెలుగు టైటాన్స్ తో ఢిల్లీ ఢీ కొంటాయి.
  • జులై 25న జరిగే పోటీలో ఢిల్లీతో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది.
  • జులై 26న జరిగే డబుల్ ధమాకా షోలో..యూపీతో గుజరాత్, తెలుగు టైటాన్స్ తో పట్నా పైరేట్స్ తలపడతాయి.

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల కబడ్డీ అభిమానులకు ప్రత్యక్షంగా 11 మ్యాచ్ లు చూసే అవకాశం ఉంది.

First Published:  18 July 2019 10:27 AM IST
Next Story