విలీనంపై చర్చకు కాంగ్రెస్ పట్టు.... అనుమతించని స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యుల విలీనం ప్రస్తావన వచ్చింది. కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరం కాంగ్రెస్ సభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ విలీనంపై చర్చించాలని కోరగా…. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున చర్చకు అనుమతించబోనని స్పీకరం పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ప్రస్తుతం చర్చ ప్రవేశపెట్టిన బిల్లుల పైనే […]

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యుల విలీనం ప్రస్తావన వచ్చింది. కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరం కాంగ్రెస్ సభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఈ విలీనంపై చర్చించాలని కోరగా…. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున చర్చకు అనుమతించబోనని స్పీకరం పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ప్రస్తుతం చర్చ ప్రవేశపెట్టిన బిల్లుల పైనే ఉంటుందని.. వేరే విషయాలు ప్రస్తావించవద్దని కోరారు.
అనంతరం సభలో మాట్లాడిన కేసీఆర్…. రాజ్యాంగ నిబంధనలను అనుసరించే కాంగ్రెస్ పార్టీ సభ్యులను విలీనం చేసుకున్నామని చెప్పారు. మూడో వంతు సభ్యులు లేఖ ఇచ్చిన తర్వాత అది చట్ట విరుద్దం ఎలా అవుతుంది.. అయినా కాంగ్రెస్ పార్టీ విలీనం కావడం కేవలం తెలంగాణలోనే జరగడం లేదన్నారు.
ఇటీవల ఏపీకి చెందిన తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో విలీనం కాలేదా.. నిన్న కర్నాటక, గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విలీనం అయ్యారు. మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకోలేక మా మీద పడి ఎందుకు ఏడుస్తరు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.