Telugu Global
NEWS

ధర్మపోరాటాలన్నీ అధర్మ పోరాటాలని టిడిపి ఒప్పుకుంటుందా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలోను, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ చేసిన ధర్మ పోరాటాలన్నీ అధర్మ పోరాటరాలేనని తెలుగుదేశం నాయకులు అంగీకరిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీ.రామచంద్రయ్య ప్రశ్నించారు. “మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అనుంగు అనుచరుడిగా పేరున్న సుజనా చౌదరి గత ప్రభుత్వం చేసిన ధర్మ పోరాటాలన్నీ అధర్మ పోరాటాలేనని అన్నారు. సుజనా చౌదరి చేసిన ఈ ప్రకటనను తెలుగుదేశం నాయకులందరూ […]

ధర్మపోరాటాలన్నీ అధర్మ పోరాటాలని టిడిపి ఒప్పుకుంటుందా ?
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలోను, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ చేసిన ధర్మ పోరాటాలన్నీ అధర్మ పోరాటరాలేనని తెలుగుదేశం నాయకులు అంగీకరిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీ.రామచంద్రయ్య ప్రశ్నించారు.

“మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అనుంగు అనుచరుడిగా పేరున్న సుజనా చౌదరి గత ప్రభుత్వం చేసిన ధర్మ పోరాటాలన్నీ అధర్మ పోరాటాలేనని అన్నారు. సుజనా చౌదరి చేసిన ఈ ప్రకటనను తెలుగుదేశం నాయకులందరూ అంగీకరిస్తారా..?” అని సీ.రామచంద్రయ్య ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

అయిదారు రోజుల క్రితమే ధర్మపోరాటాలన్నీ అధర్మమైనవని సుజనా చౌదరి ప్రకటించినా తెలుగుదేశం నాయకులు ఎవరూ ఖండించకపోవడం ఆ వ్యాఖ్యలు అంగీకరించినట్లుగానే ఉందని ఆయన పేర్కొన్నారు.

“గతంలో తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన మీ నాయకుడు చేసిన ఈ వ్యాఖ్యలను అంగీకరించాలి… లేదూ వాటిని ఖండించాలి” అని సీ.రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలతో ప్రత్యేక హోదా తీసుకురావడం అనే అంశంపై చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేసినట్లుగా బయటపడిందని రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున చేసిన ధర్మపోరాటాలన్నీ అధర్మమైనవని తేలితే వాటి కోసం చేసిన ఖర్చు అంతా వృధాయే కదా? అని రామచంద్రయ్య ప్రశ్నించారు.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన వారు ఒక్కోక్కరే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడి వైఖరిపై ప్రకటనలు చేస్తున్నారని, వాటికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి తీరాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీ.రామచంద్రయ్య ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

First Published:  18 July 2019 4:59 AM IST
Next Story