Telugu Global
NEWS

ఒక్క రూపాయి కూడా తీసుకోను...

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. బ్రేక్ దర్శనాల రద్దులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని వాటిని ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం ఉండబోదన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు అంచెలంచెలుగా కుదిస్తామని… వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరకు కుదిస్తామని వివరించారు.  2012కు ముందున్న విధానాన్ని తిరిగి […]

ఒక్క రూపాయి కూడా తీసుకోను...
X

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. బ్రేక్ దర్శనాల రద్దులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని వాటిని ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు.

ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం ఉండబోదన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు అంచెలంచెలుగా కుదిస్తామని… వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరకు కుదిస్తామని వివరించారు. 2012కు ముందున్న విధానాన్ని తిరిగి పునరుద్దరిస్తామన్నారు.

గతంలో బ్రేక్ దర్శనాల వల్ల దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. అందుకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడుతామన్నారు.

చంద్రబాబు, నారా లోకేష్‌లా తాను రాష్ట్రాన్ని దోచుకోలేదని… స్వామి వారి డబ్బును ఒక్క రూపాయి కూడా తాను వాడుకోనని వైవీ చెప్పారు. అవసరమైతే స్వామి కోసం నా సొంత డబ్బునే ఖర్చు పెడుతా… అని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

First Published:  17 July 2019 1:57 AM GMT
Next Story