Telugu Global
National

కర్నాటక రాజీనామాలపై సుప్రీం తీర్పు

కర్నాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అయితే రాజీనామాలను ఆమోదించే విషయంలో స్పీకర్‌కే పూర్తి స్వేచ్చనిచ్చింది సుప్రీం కోర్టు. రాజీనామాల ఆమోదం విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. రాజీనామాలు ఆమోదించాల్సిందిగా తాము స్పీకర్‌ను ఆదేశించలేమని చెప్పింది. అయితే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు బలపరీక్షకు వెళ్లడమా లేదా అన్నది వారి ఇష్టం అని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు బలపరీక్షకు […]

కర్నాటక రాజీనామాలపై సుప్రీం తీర్పు
X

కర్నాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అయితే రాజీనామాలను ఆమోదించే విషయంలో స్పీకర్‌కే పూర్తి స్వేచ్చనిచ్చింది సుప్రీం కోర్టు. రాజీనామాల ఆమోదం విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.

రాజీనామాలు ఆమోదించాల్సిందిగా తాము స్పీకర్‌ను ఆదేశించలేమని చెప్పింది. అయితే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు బలపరీక్షకు వెళ్లడమా లేదా అన్నది వారి ఇష్టం అని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు బలపరీక్షకు హాజరు కావాల్సిందిగా తాము ఆదేశించలేమని సుప్రీం కోర్టు తీర్పు తెచ్చింది.

ఈ నేపథ్యంలో కర్నాటక సంక్షోభానికి ఒక ముగింపు దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు కుమారస్వామి తన బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే జేడీఎస్ కూటమి బలం తగ్గిపోతోంది. అప్పుడు కుమారస్వామి బలపరీక్షలో నెగ్గుతారా? అన్నది అనుమానమే.

First Published:  17 July 2019 5:48 AM IST
Next Story