Telugu Global
NEWS

చంద్రబాబు పక్క సీటుకు అంత డిమాండా?

అసెంబ్లీలో అచ్చెన్నాయుడు సీటుకు ఎసరొచ్చేసింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చర్య… అటు తిరిగి ఇటు తిరిగి అచ్చెన్నాయుడు సీటుకు ఎసరుపెట్టింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి … టీడీపీ సభ్యులకు పక్కనే ఉన్న వరుసలో కూర్చుంటూ వచ్చారు. ఈరోజు సభలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి టీడీపీ సభ్యులతో వాగ్వాదానికి దిగడంతో జోక్యం చేసుకున్న స్పీకర్‌ … వెంటనే కేటాయించిన సీట్లలోకి వెళ్లిపోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదేశించారు. తన […]

చంద్రబాబు పక్క సీటుకు అంత డిమాండా?
X

అసెంబ్లీలో అచ్చెన్నాయుడు సీటుకు ఎసరొచ్చేసింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చర్య… అటు తిరిగి ఇటు తిరిగి అచ్చెన్నాయుడు సీటుకు ఎసరుపెట్టింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి … టీడీపీ సభ్యులకు పక్కనే ఉన్న వరుసలో కూర్చుంటూ వచ్చారు. ఈరోజు సభలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి టీడీపీ సభ్యులతో వాగ్వాదానికి దిగడంతో జోక్యం చేసుకున్న స్పీకర్‌ … వెంటనే కేటాయించిన సీట్లలోకి వెళ్లిపోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదేశించారు. తన సీట్లోకి వెళ్లేందుకు సిద్ధమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… మరి అచ్చెన్నాయుడు సంగతేంటని ప్రశ్నించారు.

నిజానికి అచ్చెన్నాయుడు సీటు చంద్రబాబుకు వెనుక కేటాయించారు. చంద్రబాబు పక్కన సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్యచౌదరికి కేటాయించారు. అయినప్పటికీ గోరంట్ల బుచ్చయ్యచౌదరిని వెనక్కు పంపించి… ఆయన స్థానంలో చంద్రబాబు పక్కన అచ్చెన్నాయుడు కూర్చుంటూ వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తనకు కేటాయించిన సీట్లోకి వెళ్లే సమయంలో అచ్చెన్నాయుడిని కూడా వెనక్కు పంపాలని కోరడంతో వివాదం రేగింది. స్పీకర్‌ కూడా ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాల్సిందిగా ఆదేశించడంతో… బుచ్చయ్యచౌదరి నడుచుకుంటూ చంద్రబాబు పక్కన కూర్చునేందుకు వచ్చారు. కానీ ఇంతలో జోక్యం చేసుకున్న చంద్రబాబు… తమకు నచ్చిన విధంగా కూర్చుంటామని… ఆ వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇందుకు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తన సీట్లో కూర్చునేందుకు వచ్చిన గోరంట్ల బుచ్చయ్యచౌదరిని చంద్రబాబు వెనక్కు పంపడం సరికాదని… రూల్స్ ప్రకారం ఎవరి సీట్లలో వారు కూర్చోవాల్సిందేనన్నారు. దాంతో స్పందించిన స్పీకర్‌… సీట్లు మార్చుకునే విషయంలో పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని అంత వరకు ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని ఆదేశించారు.

దాంతో అచ్చెన్నాయుడు వెనక్కు వెళ్లిపోయారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ముందుకొచ్చి చంద్రబాబు పక్కన కూర్చున్నారు. ఈ పరిణామంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి… ఎవరికి నచ్చిన చోట వారు కూర్చోవచ్చని చంద్రబాబు భావిస్తే అప్పుడు తమ సభ్యులు కూడా టీడీపీ సభ్యుల వైపు వెళ్లి కూర్చుంటారని దానికి చంద్రబాబు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

First Published:  17 July 2019 12:20 AM GMT
Next Story