మరో క్యాంపు కార్యాలయం అవసరమా?
దేశంలో టీటీడీ బోర్డులో సభ్యుడిగా అవకాశం వస్తే చాలు అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. ఇక చైర్మన్ పదవి వస్తే ఈ జన్మకు ఇది చాలు అనుకునే వారున్నారు. చైర్మన్ పదవి ఇస్తే పూర్తిగా స్వామి సేవకే అంకితం అవుదామనుకుంటారు. గతంలో వచ్చిన చైర్మన్లలో కొందరిపై విమర్శలు వచ్చినా చాలా మంది స్వామి సేవలో తరించారు. ఎక్కడా అతి చేయకుండా జాగ్రత్తగా పనిచేశారు. తిరుమల కొండపైనే చైర్మన్లు క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని అక్కడి బాగోగులను […]
దేశంలో టీటీడీ బోర్డులో సభ్యుడిగా అవకాశం వస్తే చాలు అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. ఇక చైర్మన్ పదవి వస్తే ఈ జన్మకు ఇది చాలు అనుకునే వారున్నారు. చైర్మన్ పదవి ఇస్తే పూర్తిగా స్వామి సేవకే అంకితం అవుదామనుకుంటారు.
గతంలో వచ్చిన చైర్మన్లలో కొందరిపై విమర్శలు వచ్చినా చాలా మంది స్వామి సేవలో తరించారు. ఎక్కడా అతి చేయకుండా జాగ్రత్తగా పనిచేశారు. తిరుమల కొండపైనే చైర్మన్లు క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని అక్కడి బాగోగులను చూసుకుంటూ వచ్చారు. కానీ కొత్త చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుని అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు.
వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లి అంటే జగన్ నివాసానికి సమీపంలో టీటీడీ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం సుబ్బారెడ్డి మౌలిక ఆదేశాలు జారీ చేశారని.. కాబట్టి క్యాంపు కార్యాలయానికి అవసరమైన ఒక పెద్ద ఆఫీస్‌ను చూడాలంటూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాడేపల్లిలో సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయానికి ఆరుగురు సిబ్బందిని కూడా నియమించుకుంటున్నారు. సుబ్బారెడ్డి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో గానీ… సామాన్యుల నుంచి మాత్రం వ్యతిరేకత వస్తోంది.
తాడేపల్లి నుంచే తిరుమలను పాలిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లిలో కూర్చుని దర్శనం టికెట్లు జారీ చేస్తారా? అని నిలదీస్తున్నారు?. తిరుమల విషయంలో ఏమాత్రం చిన్న పొరపాటు, అతి జరిగినా అది జగన్ రాజకీయ జీవితానికే ముప్పు తెస్తుందని తెలిసి కూడా వైవీ సుబ్బారెడ్డి ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న దానిపై వైసీపీ వారే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.