Telugu Global
NEWS

అలిగిన ఐపీఎస్... ఉద్యోగానికి రాజీనామా..?

అప్రధానమైన పోస్టును ఇచ్చినందుకు ఐపీఎస్ సీనియర్ అధికారి వీ.కే.సింగ్ (వినయ్ కుమార్ సింగ్) తన ఉద్యోగానికి రాజీనామా చేసారని సమాచారం. గడచిన ఐదేళ్లుగా జైళ్ల శాఖ డీజీగా పని చేస్తున్న వీ.కే.సింగ్ ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ శాఖకు బదిలీ చేసింది ప్రభుత్వం. అయితే ఈ బదిలీపై సన్నిహితుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీ.కే.సింగ్… తన ఉద్యోగానికి రాజీనామా చేశారని చెబుతున్నారు. ఈ నెల 6 వ తేదీన వీ.కే.సింగ్ ను బదిలీ […]

అలిగిన ఐపీఎస్... ఉద్యోగానికి రాజీనామా..?
X

అప్రధానమైన పోస్టును ఇచ్చినందుకు ఐపీఎస్ సీనియర్ అధికారి వీ.కే.సింగ్ (వినయ్ కుమార్ సింగ్) తన ఉద్యోగానికి రాజీనామా చేసారని సమాచారం.

గడచిన ఐదేళ్లుగా జైళ్ల శాఖ డీజీగా పని చేస్తున్న వీ.కే.సింగ్ ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ శాఖకు బదిలీ చేసింది ప్రభుత్వం. అయితే ఈ బదిలీపై సన్నిహితుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీ.కే.సింగ్… తన ఉద్యోగానికి రాజీనామా చేశారని చెబుతున్నారు.

ఈ నెల 6 వ తేదీన వీ.కే.సింగ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జరిగి పది రోజులు అయినా ఆయన ఇంకా విధుల్లో చేరలేదు. ఐపీఎస్ అధికారి వీ.కే.సింగ్ ఈనెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ సెలవులో ఉండి ఆయన సొంత రాష్ట్ర్రం బీహార్ వెళ్లారు. తాను సెలవులో ఉన్న సమయంలో తనను బదిలీ చేశారంటూ వీ.కే.సింగ్ సహచర ఉన్నతాధికారుల వద్ద మనస్తాపం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

వీ.కే.సింగ్ బదిలీ పోలీసు వర్గాల్లో చర్చకు దారితీసింది. వీ.కే. సింగ్ స్ధానంలో జైళ్ల శాఖకు బదిలీ చేసిన కొత్త డీజీ సందీప్ ను వెంటనే విధుల్లో చేరాలంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిణామాలన్నీ తనను ఇరుకున పెట్టేందుకే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీ.కే.సింగ్.

ఉత్తర భారతదేశానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, గడచిన మూడు దశాబ్దాలుగా సమైక్య రాష్ట్రంలో కాని, తెలంగాణలో కాని తనకు మంచి పోస్టింగ్ ఇవ్వలేదని వీ.కే.సింగ్ తన సహచర అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

1987 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి వీ.కే.సింగ్ కు మరో రెండేళ్లు సర్వీసు ఉంది. ప్రస్తుతం వీ.కే.సింగ్ అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. గడచిన రెండేళ్లుగా ఆయన డీజీపీ హోదా వస్తుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అప్రధానమైన శాఖకు బదిలీ చేయడంతో వీ.కే.సింగ్ మనస్తాపం చెంది… ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

First Published:  16 July 2019 4:43 AM IST
Next Story