బీజేపీలోకి జూపూడి.... ముహూర్తమే తరువాయి !
అధికారం కావాలి లేదా అధికార పార్టీలో చేరాలి. కొందరు నేతలది ఇదే సిద్ధాంతం. తాజాగా ఈ లిస్ట్‌లో చేరబోతున్నారు మరో టీడీపీ నేత, మాలమహానాడు నేత జూపూడి ప్రభాకర్. ఈయన త్వరలో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. టీడీపీని వీడేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం సన్నిహితుల దగ్గర చెప్పేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి జూపూడి ప్రభాకర్ జంప్ అయ్యారు. అక్కడ నామినేటేడ్ పదవి […]
అధికారం కావాలి లేదా అధికార పార్టీలో చేరాలి. కొందరు నేతలది ఇదే సిద్ధాంతం. తాజాగా ఈ లిస్ట్‌లో చేరబోతున్నారు మరో టీడీపీ నేత, మాలమహానాడు నేత జూపూడి ప్రభాకర్. ఈయన త్వరలో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. టీడీపీని వీడేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం సన్నిహితుల దగ్గర చెప్పేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.
2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి జూపూడి ప్రభాకర్ జంప్ అయ్యారు. అక్కడ నామినేటేడ్ పదవి కొట్టేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు.
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ పార్టీలోకి జంప్ అయ్యేందుకు చాన్స్ లేదు. అక్కడ ఆయనకు స్థానం లేదు. ఒకసారి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి లోపలకు రానీచ్చే అవకాశం లేదు. దీంతో పక్కచూపులు చూస్తున్నారు జూపూడి ప్రభాకర్.
ఏపీలో మిగిలిన ఒకే ఒక ఆప్షన్ బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉంది. ఇంకేం కావాలి. ఇటీవల కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. ముందే వెళితే అధికార ప్రతినిధి లాంటి పదవులు వస్తాయి. బీజేపీ నేతలు కూడా దళిత నేతల కోసం వెతుకుతున్నారు.
దీంతో తాను ముందే వెళ్లి కర్చీప్ వేయాలని జూపూడి ప్లాన్‌లు వేస్తున్నారు. అయితే బీజేపీలోకి ఎలా వెళ్లాలి? అనే ప్రశ్న మాత్రం ఆయన్ని వెంటాడుతోంది. ఎవరి ద్వారా వెళితే మంచి చాన్స్ వస్తుందని పొలిటికల్ లెక్కలు వేస్తున్నారట. బీజేపీలోకి ఎవరి ద్వారా వెళ్లమంటారు? అని కొందరు సన్నిహితులను ఆయన అడుగుతున్నారట.
కొత్తగా బీజేపీలో చేరిన సుజనా బ్యాచ్ ద్వారా వెళ్లాలా? లేక రాంమాధవ్ ద్వారా ఎంట్రీ ఇవ్వాలా? అని జూపూడి తెగ మధనపడుతున్నారట. దీంతో బీజేపీ కండువా ఆయన కప్పుకోవడం ఖాయం. కానీ ఎవరితో కప్పించుకోవాలనే దానిపైనే జూపూడి తేల్చుకోలేకపోతున్నారు.
మొత్తానికి టీడీపీలో ఉండే కీలక నేతలు మాత్రం ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఆషాడం వెళ్లిన తర్వాత కమలం గూటికి చేరేందుకు ప్లాన్‌లు వేస్తున్నారు.