బాబు విమాన ఖర్చులు... అక్కడికి లోకేష్ ఎలా వెళ్తారు?
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేశారని పలువురు రాజకీయ నాయకులు మండిపడ్డారు. “రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు విదేశాలలో పర్యటిస్తున్నామన్నారు. 20 మంది వందిమాగదులతో కలిసి ముప్పై ఎనిమిది సార్లు విదేశీయానం చేశారు చంద్రబాబు నాయుడు. ఒక్క పైసా కూడా పెట్టుబడిగా తీసుకు రాలేకపోయారు” అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకుడు తిరుమలరావు మండిపడ్డారు. […]
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేశారని పలువురు రాజకీయ నాయకులు మండిపడ్డారు.
“రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు విదేశాలలో పర్యటిస్తున్నామన్నారు. 20 మంది వందిమాగదులతో కలిసి ముప్పై ఎనిమిది సార్లు విదేశీయానం చేశారు చంద్రబాబు నాయుడు. ఒక్క పైసా కూడా పెట్టుబడిగా తీసుకు రాలేకపోయారు” అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకుడు తిరుమలరావు మండిపడ్డారు.
బాబు విదేశీ పర్యటనలు… పెట్టుబడులు అనే అంశం పై ఓ చానల్ నిర్వహించిన చర్చాగోష్టిలో ఈ ఇద్దరు నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన శర్మ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పెట్టుబడులు తీసుకువస్తామని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాలలో విదేశాలకు తిరిగే వారే తప్ప ఒక్క పైసా కూడా తీసుకు రాలేదు అన్నారు.
“ఆ దేశం నుంచి ఆ కంపెనీ వస్తోంది… ఈ దేశం నుంచి ఈ కంపెనీలు, పెట్టుబడులు తీసుకు వస్తున్నాను… అంటూ పచ్చ మీడియా లో కథనాలు రాయించుకున్నారే తప్ప ఒక పైసా పెట్టుబడి కూడా రాలేదు” అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి విమర్శించారు. ఈ వృధా ఖర్చులపై లెక్కలు తీయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలే కాకుండా ప్రైవేటు కార్యక్రమాలకు కూడా ప్రజాధనాన్ని వృధా చేశారని భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుమలరావు ఆరోపించారు.
“కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారానికి ప్రజాధనాన్ని వృధా చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. ఎన్నికల ప్రచారానికి ప్రజల సొమ్ము ఖర్చు చేస్తారా..?” అని తిరుమలరావు ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు చేసిన అవినీతిపై రగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని, అవినీతికి మారుపేరుగా మారిన చంద్రబాబు నాయుడుని నూతనంగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జైలుకు పంపుతుందని ఆశిస్తున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు దావోస్ లో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నలుగురు సభ్యుల బృందంతో అక్కడికి వెళ్లారని, ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శర్మ ఆరోపించారు.
“దావోస్ లో జరిగే పారిశ్రామికవేత్తల సమావేశం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం. అందులో పాల్గొనే వాళ్లందరూ పారిశ్రామికవేత్తలు మాత్రమే. ప్రభుత్వం తరఫున ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు నారా లోకేష్ ఎలా వెళ్తారు..?” అని శర్మ ప్రశ్నించారు.