Telugu Global
NEWS

విద్యుత్తు ఒప్పందాలను సమీక్షిస్తాం

తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్తు ఒప్పందాలను తాము తప్పకుండా సమీక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం స్పష్టం చేశారు. “పాత ప్రభుత్వంలో విద్యుత్తును అధిక రేట్లకు కొనుగోలు చేశారు. ఎంతో ఎక్కువ ధర చెల్లించారు. ఈ చెల్లింపుల వల్ల ఎవరెవరు లబ్ధి పొందారో తేలుస్తాం” అని అజయ్ కల్లాం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అధిక మొత్తంలో విద్యుత్ ను కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వచ్చిందని ఆయన అన్నారు. […]

విద్యుత్తు ఒప్పందాలను సమీక్షిస్తాం
X

తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్తు ఒప్పందాలను తాము తప్పకుండా సమీక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం స్పష్టం చేశారు.

“పాత ప్రభుత్వంలో విద్యుత్తును అధిక రేట్లకు కొనుగోలు చేశారు. ఎంతో ఎక్కువ ధర చెల్లించారు. ఈ చెల్లింపుల వల్ల ఎవరెవరు లబ్ధి పొందారో తేలుస్తాం” అని అజయ్ కల్లాం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

అధిక మొత్తంలో విద్యుత్ ను కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వచ్చిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 133 పీపీఏ లు ఉన్నాయని, వాటిలో ఐదు సంస్థలు మాత్రమే 70 శాతం విద్యుత్ అందిస్తున్నాయని ఆయన చెప్పారు.

గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలతో సంబంధం లేకుండా యూనిట్ కు రెండు రూపాయల 70 పైసలుకు విద్యుత్ ను అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు. విద్యుత్ సంస్థలపై సమీక్షలు జరుపుతామంటే పాత ప్రభుత్వంలోని పెద్దలకు ఉలికిపాటు ఎందుకు అని అజయ్ కల్లాం ప్రశ్నించారు.

ఎక్కువ ధరకు విద్యుత్తును కొనాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ధరలు తగ్గించిన పీపీఏలను కొనసాగిస్తామని అజయ్ కల్లాం స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల డిస్కమ్ లకు 20 వేల కోట్ల రూపాయల అప్పు మిగిలిందని ఆంధ్ర ప్రదేశ్ డిస్కమ్ ఎండి శ్రీకాంత్ అన్నారు.

మరోవైపు విద్యుత్ ఒప్పందాలపై సమీక్షల కోసం ప్రభుత్వం నియమించిన కమిటీలో మార్పులు చేశారు. ఇంతకు ముందు ఈ కమిటీలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో న్యాయశాఖ కార్యదర్శిని సభ్యులుగా చేర్చారు.

ఇక మిగిలిన కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, డిస్కం ఎండి శ్రీకాంత్ సభ్యులుగా ఉంటారు. విద్యుత్ ఒప్పందాలపై ఈ కమిటీ సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తుంది.

First Published:  16 July 2019 4:41 AM IST
Next Story