టీడీపీ నా రాజకీయ శత్రువే.... హోదాపై అధర్మపోరాటం చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రానికి ప్రత్యేక హోదా కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ధర్మ పోరాటం అధర్మ పోరాటమా…? అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలోను, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పట్టణాలు, నగరాల్లోనూ తెలుగుదేశం పార్టీ చేసిన ధర్మ పోరాటం పైన పటారం… లోన లొటారమేనా…? ధర్మపోరాటం పేరుతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరేనా…? అవును… ఇవన్నీ నిజాలే అంటున్నారు ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రానికి ప్రత్యేక హోదా కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ధర్మ పోరాటం అధర్మ పోరాటమా…? అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలోను, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పట్టణాలు, నగరాల్లోనూ తెలుగుదేశం పార్టీ చేసిన ధర్మ పోరాటం పైన పటారం… లోన లొటారమేనా…? ధర్మపోరాటం పేరుతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరేనా…?
అవును… ఇవన్నీ నిజాలే అంటున్నారు ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, నేటి భారతీయ జనతా పార్టీ నాయకుడు సుజనా చౌదరి. రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీకి తిలోదకాలు ఇచ్చి అధికార భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
ఈ చేరిక తర్వాత ఆయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వచ్చాడు. ఆదివారం అమరావతిలో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో సుజనాచౌదరి ఆనాటి సంగతులను సవివరంగా వెల్లడించాడు.
” ప్రత్యేక హోదా రాదని నాకు తెలుసు. ఇందుకోసం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ధర్మ పోరాటం పూర్తిగా అధర్మ పోరాటం. అందుకే నేను కొన్ని ధర్మ పోరాట కార్యక్రమాల్లో పాల్గొన లేదు” అని సుజనా చౌదరి వెల్లడించాడు.
ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్ర్రానికి ఎంతో చేసిందని, ఆ సహాయాన్ని చంద్రబాబు నాయుడు నిలుపుకోలేదని సుజనా చౌదరి అన్నాడు.
“గతంలో ఏ రాష్ట్ర్ర ప్రభుత్వానికి కేంద్రంలో అధికారంలో ఉన్న వారెవ్వరూ నరేంద్ర మోడీ చేసినంత సాయం చేయలేదు. ఈ విషయాన్ని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను” అని సుజనా చౌదరి చెప్పాడు.
ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని, ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానని కూడా సుజనా చౌదరి అన్నాడు.
” కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఒక రాష్ట్ర్రానికి అన్యాయం చేసి మరో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడికి నేను చాలాసార్లు చెప్పాను. అయినా ఆయన నాలుగు సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నాడు” అని సుజనా చౌదరి అన్నారు.
దీంతో పాటు కడప స్టీల్ ప్లాంట్ అంశం కూడా విభజన చట్టంలో లేదని, పరిశ్రమ ఏర్పాటుపై పరిశీలిస్తామని మాత్రమే ఉందని సుజనా చౌదరి అన్నాడు.
అయితే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం విభజన చట్టంలో ఉన్న అంశాలను పట్టించుకోలేదు అన్నాడు. తాను చరిత్ర మాట్లాడనని, తెలుగుదేశం పార్టీ తన రాజకీయ శత్రువేనని ఆయన చెప్పారు.
బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి స్వంత రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా అపూర్వ స్వాగతం లభించింది. బీజేపీ నేతలకు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు.@BJP4Andhra @BJP4India pic.twitter.com/vbrLUtLAfi
— YS Chowdary (@yschowdary) July 14, 2019