బీజేపీలోకి రేవంత్ రెడ్డి.... క్లారిటీ ఇచ్చేశాడు....
తాజాగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళుతున్నట్టు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రావడం.. ఆయన కాంగ్రెస్ ఎంపీలతో కలిసి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం విస్తృతంగా సాగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. హేమాహేమీలందరూ మట్టికరిచారు. దేశంలో కాంగ్రెస్ కూడా 52 సీట్లకే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే రేవంత్ రెడ్డి కూడా పీసీసీ […]
తాజాగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళుతున్నట్టు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రావడం.. ఆయన కాంగ్రెస్ ఎంపీలతో కలిసి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం విస్తృతంగా సాగింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. హేమాహేమీలందరూ మట్టికరిచారు. దేశంలో కాంగ్రెస్ కూడా 52 సీట్లకే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే రేవంత్ రెడ్డి కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదలుకున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్నారు.
అయితే బీజేపీ ఆపరేషన్ తెలంగాణలో ముఖ్యనేత రేవంత్ రెడ్డియే అన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. బలమైన కేసీఆర్ ను ఢీకొట్టే రేవంత్ ను బీజేపీలోకి లాగాలని ప్రయత్నాలు జరిగాయంట..
తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్న అడిగారు. బీజేపీలో చేరుతున్నారన్న వార్తలను రేవంత్ ఖండించారు. దేశంలో మోడీ మోనార్క్ లా పాలిస్తున్నారని.. ఆయన ఉండగా ఏ నేత బీజేపీలో ఎదగరని రేవంత్ చెప్పారు. బుద్ది ఉన్నవాడు ఎవడూ బీజేపీలో చేరడు అని కుండబద్దలు కొట్టారు.
తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని.. ఆ పార్టీలో చేరి తాను సీఎం అవుతానా.? పీఎం అవుతానా? అది కష్టమంటూ రేవంత్ ఊహాగానాలకు తెరదించారు. దీంతో రేవంత్ బీజేపీలోకి వెళుతున్న ప్రచారం ఉట్టి ఊహాగానమేనని తేలింది.