Telugu Global
NEWS

కేసీఆర్, కేటీఆర్ లను కలవరపెడుతున్న కొత్త ఎంపీలు

కుర్ర ఎంపీలు.. తొలిసారే గెలిచారు. కానీ బీజేపీ భావజాలంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు. వీరి దూకుడుకు ఇప్పుడు టీఆర్ఎసే బేజారవుతోంది. పదునైన విమర్శలు, టీఆర్ఎస్ లోని కీలక నేతలను లాగేయడానికి.. ఉత్తర తెలంగాణలో బలమైన టీఆర్ఎస్ ను అంతే బలంగా ఎదుర్కొంటున్న వీరి దూకుడు చూసి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లు క్షేత్ర స్థాయిలోకి దూకుడుగా ముందుకెళ్తున్నారు. తమ పార్లమెంట్ పరిధిలో మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నా… ప్రొటోకాల్ ప్రకారం […]

కేసీఆర్, కేటీఆర్ లను కలవరపెడుతున్న కొత్త ఎంపీలు
X

కుర్ర ఎంపీలు.. తొలిసారే గెలిచారు. కానీ బీజేపీ భావజాలంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు. వీరి దూకుడుకు ఇప్పుడు టీఆర్ఎసే బేజారవుతోంది. పదునైన విమర్శలు, టీఆర్ఎస్ లోని కీలక నేతలను లాగేయడానికి.. ఉత్తర తెలంగాణలో బలమైన టీఆర్ఎస్ ను అంతే బలంగా ఎదుర్కొంటున్న వీరి దూకుడు చూసి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిజామాబాద్ ఎంపీ అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లు క్షేత్ర స్థాయిలోకి దూకుడుగా ముందుకెళ్తున్నారు. తమ పార్లమెంట్ పరిధిలో మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నా… ప్రొటోకాల్ ప్రకారం ఎంపీలుగా వీరే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతూ, ప్రారంభిస్తూ గులాబీ ఎమ్మెల్యేలకు షాకిస్తున్నారు.

ఇక గులాబీలోని టికెట్లు దక్కని బలమైన అసంతృప్తులను ఇప్పుడు ఉత్తర తెలంగాణలో లాగేసే పనికి శ్రీకారం చుట్టారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్ గా చేసిన సోమారపు సత్యనారాయణను తాజాగా ఈ ఇద్దరు ఎంపీలు అరవింద్, బండి సంజయ్ లు బీజేపీలో చేర్చుకున్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సోమారపుతో కలిసి రామగుండంపై బీజేపీ జెండాను ఎగురవేయాలని వీరిద్దరూ పెద్ద స్కెచ్ గీయడం విశేషం.

బలమైన సోమారపు తనను టీఆర్ఎస్ పట్టించుకోకపోవడంపై కలత చెంది పార్టీ మారారు.

కాగా ఈ ఇద్దరూ ఇప్పుడు టీఆర్ఎస్ లోని అసంతృప్తులను పసిగట్టి వారికి అవకాశం ఇచ్చి బీజేపీలోకి లాగడం కేసీఆర్, కేటీఆర్ కు శరాఘాతంగా మారింది. బలమైన ఉత్తరతెలంగాణలో టీఆర్ఎస్ లో నాయకులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు టికెట్లు దక్కని వారంతా బీజేపీలోచేరి పోటీచేయాలని చూడడం, టీఆర్ఎస్ ను తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇలా ఇద్దరు కుర్ర ఎంపీలు టీఆర్ఎస్ కు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.

First Published:  15 July 2019 7:36 AM IST
Next Story