Telugu Global
National

బీజేపీ ఏపీ సీఎం అభ్యర్థిగా సుజనాచౌదరి?

రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి రాజకీయం అందరినీ అవురా అనిపిస్తోంది. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్‌ మాల్యా, నీరవ్ మోడీలు భయంతో దేశం విడిచిపారిపోగా… బ్యాంకులకు వేల కోట్ల అప్పు ఉన్న సుజనాచౌదరి మాత్రం బీజేపీలో చేరి సన్మానాలు అందుకుంటున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఏపీకి వచ్చిన సుజనాచౌదరికి సన్మానం చేసి సత్కరించేందుకు బీజేపీ నేతలు పోటీ పడ్డారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జ్ సునీల్‌ దేవ్‌ధర్‌ కూడా సుజనా సన్మాన కార్యక్రమంలో పాల్గొని థన్యత […]

బీజేపీ ఏపీ సీఎం అభ్యర్థిగా సుజనాచౌదరి?
X

రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి రాజకీయం అందరినీ అవురా అనిపిస్తోంది. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్‌ మాల్యా, నీరవ్ మోడీలు భయంతో దేశం విడిచిపారిపోగా… బ్యాంకులకు వేల కోట్ల అప్పు ఉన్న సుజనాచౌదరి మాత్రం బీజేపీలో చేరి సన్మానాలు అందుకుంటున్నారు.

బీజేపీలో చేరిన తర్వాత ఏపీకి వచ్చిన సుజనాచౌదరికి సన్మానం చేసి సత్కరించేందుకు బీజేపీ నేతలు పోటీ పడ్డారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జ్ సునీల్‌ దేవ్‌ధర్‌ కూడా సుజనా సన్మాన కార్యక్రమంలో పాల్గొని థన్యత పొందారు.

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ దేవ్‌ధర్‌ చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని… వ్యాఖ్యానించగా సుజనా చౌదరి మాత్రం చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపుతుందని తాను అనుకోవడం లేదన్నారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా అన్నది విచారణ జరిపిస్తే గానీ చెప్పలేమని, అయితే పాలన మాత్రం గాడి తప్పిందని చెప్పగలను అంటూ బాబుపై తన గౌరవాన్ని చాటుకున్నారు.

మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే… సుజనాచౌదరిని ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్‌ కూడా ఒక వర్గం అప్పుడే బీజేపీలో మొదలుపెట్టింది. చంద్రబాబు రాజకీయ గుట్టురట్టులు తెలిసిన సుజనాచౌదరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీ నుంచి వలసలు ఊపందుకుంటాయని ఆ వర్గం వాదన.

ఏపీలో టీడీపీ ప్లేస్‌ను బీజేపీ ఆక్రమించాలంటే సుజనా చౌదరిని పార్టీ ముందుపెట్టడం వల్లే సాధ్యమవుతుందంటూ వాదిస్తున్నారు. సుజనా చౌదరికి బాధ్యతలు అప్పగిస్తే టీడీపీ నుంచి వచ్చే నేతలకు పార్టీపై నమ్మకం కలుగుతుందంటూ వివరిస్తున్నారు. అయితే ఇలా వాదిస్తున్న వారు చంద్రబాబు హయాంలో బాగా లబ్ధి పొందిన వర్గం వారే కావడం విశేషం.

సుజనాకు పగ్గాలు అప్పగిస్తే ఆర్ధికంగా ఏపీలో పార్టీ బలపడినట్టు అవుతుందని సూచిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం సుజనాచౌదరి పెత్తనంపై అప్పుడే పెదవి విరుస్తున్నారు. బీజేపీ ఇంతకాలం విలువలున్న పార్టీ అన్న భావన ఉండేదని… కానీ బ్యాంకులకు వేల ఓట్లు ఎగ్గొట్టిన వారిని పార్టీలోకి చేర్చుకోవడంతో ఆ విలువ కూడా పోయిందని… ఇప్పుడు ఏకంగా సుజనాచౌదరిని ఏపీలో ముందు పెడితే ప్రజలు చీదరించడం తప్ప మరొకటి ఉండదంటున్నారు.

సుజనాచౌదరికి పార్టీ పగ్గాలు అప్పగించడం అంటే ఏపీ బీజేపీని టీడీపీ ఆఫీస్‌గా మార్చడమేనని ఇతర వర్గాల వారు లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

First Published:  15 July 2019 4:58 AM IST
Next Story