Telugu Global
Cinema & Entertainment

మళ్లీ ప్రేమలో పడ్డదట....

మలయాళం బ్యూటీ అమలాపాల్ సౌత్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. 2017 లో ఈమె టాలీవుడ్ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వారి మధ్య కొన్ని విభేదాల వలన వారు 2017 విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తర్వాత మళ్లీ వారి వారి ప్రొఫెషనల్ వర్క్ పైన దృష్టి పెట్టారు. తాజాగా జులై 11 న విజయ్ చెన్నై లో నివాసం ఉండే ఒక నివాసం ఉంటున్న ఒక […]

మళ్లీ ప్రేమలో పడ్డదట....
X

మలయాళం బ్యూటీ అమలాపాల్ సౌత్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. 2017 లో ఈమె టాలీవుడ్ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కానీ వారి మధ్య కొన్ని విభేదాల వలన వారు 2017 విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తర్వాత మళ్లీ వారి వారి ప్రొఫెషనల్ వర్క్ పైన దృష్టి పెట్టారు.

తాజాగా జులై 11 న విజయ్ చెన్నై లో నివాసం ఉండే ఒక నివాసం ఉంటున్న ఒక డాక్టర్ను పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా అమలాపాల్ తన స్పెషల్ పర్సన్ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

గత కొంతకాలంగా సినిమాలతో బిజీగా ఉన్న అమలాపాల్ త్వరలో ‘ఆడయి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ‘ఆమె’ అనే టైటిల్ తో తెలుగు లో కూడా విడుదల కాబోతోంది.

తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అమలాపాల్ గత కొంతకాలంగా తాను ఒక వ్యక్తి ని ప్రేమిస్తున్నానని, తన స్పెషల్ పర్సన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదని క్లారిటీ ఇచ్చింది.

అయితే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ప్రస్తుతం తన జీవితంలో బెస్ట్ ఫేజ్ నడుస్తోందని చెప్పుకొచ్చింది అమల.

First Published:  15 July 2019 8:18 AM IST
Next Story