Telugu Global
CRIME

రెచ్చిపోయిన ముసుగు దొంగలు " 4 లక్షలు దోపిడీ

విజయవాడలో ముసుగు దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని పాడిస్ట్ర్రీట్ లో ఉన్న ప్రగతి ట్రాన్స్ పోర్టు కార్యాలయంలోకి చొరబడిన ముగ్గురు ముసుగు దొంగలు అక్కడ విధుల్లో ఉన్న గుమాస్తాపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. అనంతరం కార్యాలయంలో ఉన్న నాలుగు లక్షల రూపాయలు దోచుకుని వెళ్లిపోయారు. ప్రగతి ట్రాన్స్ పోర్టు కార్యాలయంలోకి నేరుగా కర్రలతో ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు కనీసం మాట్లాడకుండా వచ్చిన వారు వచ్చినట్లుగా కర్రలతో గుమాస్తాపై దారుణంగా దాడి చేశారు. మారు మాట్లాడకుండా అక్కడ […]

రెచ్చిపోయిన ముసుగు దొంగలు  4 లక్షలు దోపిడీ
X

విజయవాడలో ముసుగు దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని పాడిస్ట్ర్రీట్ లో ఉన్న ప్రగతి ట్రాన్స్ పోర్టు కార్యాలయంలోకి చొరబడిన ముగ్గురు ముసుగు దొంగలు అక్కడ విధుల్లో ఉన్న గుమాస్తాపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. అనంతరం కార్యాలయంలో ఉన్న నాలుగు లక్షల రూపాయలు దోచుకుని వెళ్లిపోయారు.

ప్రగతి ట్రాన్స్ పోర్టు కార్యాలయంలోకి నేరుగా కర్రలతో ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు కనీసం మాట్లాడకుండా వచ్చిన వారు వచ్చినట్లుగా కర్రలతో గుమాస్తాపై దారుణంగా దాడి చేశారు. మారు మాట్లాడకుండా అక్కడ నాలుగు లక్షల రూపాయలు ఉన్న ఓ బ్యాగ్ ను తీసుకుని వెళ్లిపోయారు.

ఈ హఠాత్ సంఘటనతో ఏం జరుగుతోందో గుమాస్తాకు తెలియలేదు. తీవ్రంగా గాయపడిన గుమాస్తాను ఆసుపత్రికి తరలించారు. కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీలో ముసుగు దొంగల దాడి, చోరీ చేసి విధానం రికార్డ్ అయ్యింది. దీనిపై నగరంలోని కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నారు.

ఇక ఈ దాడి, దోపిడీ ఇంటి దొంగల పనే అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రగతి ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో పది మంది వరకూ పని చేస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, డబ్బు బ్యాగు ఉన్న చోటుకు నేరుగా వెళ్లి దాన్ని తీసుకుని వెళ్లిపోవడవంతో ఇది ఇంటి దొంగల పనే అని భావిస్తున్నారు.

ప్రగతి ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుమాస్తా తనపై దాడి చేసిన వారిని తాను గుర్తించలేనని, వారు వచ్చి రావడమే తనపై కర్రలతో దాడి చేసి డబ్బు తీసుకుపోయారని చెప్పారు.

First Published:  14 July 2019 6:05 AM IST
Next Story