చంద్రబాబుకు, లోకేష్ కు అదే తేడానట....
నాయకత్వ లక్షణాలు స్వతహాగా వస్తాయి. నాయకులు జనంలోంచి పుట్టుకొస్తారు. 1970వ దశకంలో చంద్రబాబు అలాగే చిత్తూరు జిల్లాలో చిన్న విద్యార్థి నాయకుడిగా మొదలైన ప్రస్థానం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా సాగింది. నాయకత్వ లక్షణాలు అందరికీ రావు. అందరూ ఎమ్మెల్యేలను మెప్పించి ఒప్పించి నాయకుడిగా నిలబడాలంటే అంత తేలికైన విషయం కాదు. టీడీపీని హైజాక్ చేసి అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి టీడీపీ అధ్యక్షుడిగా మారారు. ఇప్పటికీ అదే నాయకత్వ పటిమతో కొనసాగుతున్నారు. అయితే 2019 […]
నాయకత్వ లక్షణాలు స్వతహాగా వస్తాయి. నాయకులు జనంలోంచి పుట్టుకొస్తారు. 1970వ దశకంలో చంద్రబాబు అలాగే చిత్తూరు జిల్లాలో చిన్న విద్యార్థి నాయకుడిగా మొదలైన ప్రస్థానం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా సాగింది.
నాయకత్వ లక్షణాలు అందరికీ రావు. అందరూ ఎమ్మెల్యేలను మెప్పించి ఒప్పించి నాయకుడిగా నిలబడాలంటే అంత తేలికైన విషయం కాదు. టీడీపీని హైజాక్ చేసి అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి టీడీపీ అధ్యక్షుడిగా మారారు. ఇప్పటికీ అదే నాయకత్వ పటిమతో కొనసాగుతున్నారు.
అయితే 2019 ఎన్నికల్లో దారుణ ఓటమితో ఇప్పుడు టీడీపీపై, చంద్రబాబుపై అనుమానాలు కలుగుతున్నాయి. వృద్ధాప్యం వెంటాడుతున్న వేళ అసలు చంద్రబాబు 2024లో…. ఆ తర్వాత… ఎలా ముందుకెళ్తాడనేది టీడీపీ శ్రేణుల్లో అనుమానాలకు కారణమవుతోంది.
అయితే చంద్రబాబు తర్వాత భావి నాయకుడిగా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయాలని బాబు భావిస్తున్నాడు. కానీ టీడీపీ నాయకులు, శ్రేణులు మాత్రం లోకేష్ పై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ కు, సామర్థ్యం లేని వ్యక్తికి ఇవ్వవద్దంటున్నారు.
అయితే బాబులా జనంలోంచి వచ్చిన వ్యక్తి లోకేష్ కాదు. స్వతహా చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి వరకు బాబు ప్రస్థానం… కష్టం, నాయకత్వ లక్షణాలు అసమానమైనవి. కానీ లోకేష్ లో మాత్రం అవేవీ లేవు. తండ్రి చాటు బిడ్డగా వచ్చారు.
ఆల్ ఇండియా టొబాకో బోర్డ్ చైర్మన్ గా నియమితులైన ఏపీ బీజేపీ సీనియర్ నేత రఘునాథ బాబు తాజాగా లోకేష్ నాయకత్వంపై హాట్ కామెంట్ చేశారు. టీడీపీలో చంద్రబాబుతోపాటు చాలా మంది సీనియర్లు, సమర్థులు ఉన్నారని.. వారందరినీ పక్కనపెట్టి అస్సలు నాయకత్వ లక్షణాలు లేని లోకేష్ బాబును టీడీపీపై ఎందుకు రుద్దుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు.
లోకేష్ కు నాయకత్వం ఇస్తే టీడీపీ మునగడం ఖాయమని.. చంద్రబాబు ఆ పని చేయకుండా ఉంటేనే మంచిదని హాట్ కామెంట్ చేశారు. దీన్ని బట్టి లోకేష్ ను భావి నాయకుడిగా టీడీపీ నేతలే కాదు.. మిగతా నేతలు కూడా అంగీకరించని పరిస్థితి ఏర్పడింది.