Telugu Global
NEWS

సున్నా వడ్డీకి వంద కోట్లే ఎందుకు కేటాయించారంటే?

సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వాలంటే ఏటా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుందని…. కానీ ఆ పని చంద్రబాబు చేయలేదు అని వైసీపీ అసెంబ్లీలోనే విమర్శించింది. ఇప్పుడు బడ్జెట్‌లో రైతుకు సున్నా వడ్డీ పథకం కోసం 100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకు చంద్రబాబు గతంలో సున్నా వడ్డీకి వంద కోట్లు కేటాయిస్తే అవి ఎక్కడ సరిపోతాయని ప్రశ్నించిన జగన్‌ మోహన్ రెడ్డి… ఇప్పుడు వంద కోట్లు మాత్రమే సున్నా వడ్డీకి […]

సున్నా వడ్డీకి వంద కోట్లే ఎందుకు కేటాయించారంటే?
X

సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వాలంటే ఏటా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుందని…. కానీ ఆ పని చంద్రబాబు చేయలేదు అని వైసీపీ అసెంబ్లీలోనే విమర్శించింది. ఇప్పుడు బడ్జెట్‌లో రైతుకు సున్నా వడ్డీ పథకం కోసం 100 కోట్లు మాత్రమే కేటాయించారు.

ఇప్పటి వరకు చంద్రబాబు గతంలో సున్నా వడ్డీకి వంద కోట్లు కేటాయిస్తే అవి ఎక్కడ సరిపోతాయని ప్రశ్నించిన జగన్‌ మోహన్ రెడ్డి… ఇప్పుడు వంద కోట్లు మాత్రమే సున్నా వడ్డీకి ఎందుకు కేటాయించారు అని టీడీపీ ప్రశ్న.

ఈ అంశంపై వెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరణ కూడా ఇచ్చారు. ” 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం జులై నెల రెండో వారంలో ఉన్నాం. ఇటీవలే ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రూ.87 వేల కోట్ల మేరకు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే ఏడాది నుంచి అంటే.. ఏప్రిల్‌ -1, 2020తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి, వచ్చే బడ్జెట్‌లో సున్నావడ్డీ రుణాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.

కాబట్టి ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీలేని రైతు రుణాలకు ప్రభుత్వం వడ్డీ కట్టాలి కాబట్టి…. వచ్చే బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు పెరుగుతాయన్న విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని వివరణ ఇచ్చారు బుగ్గన.

రైతులు బ్యాంకుల నుంచి ఇప్పుడు రుణాలు తీసుకుంటారు కాబట్టి ఆ రుణాలపై వడ్డీని వచ్చే ఏడాది చెల్లించాల్సి ఉంటుంది… కాబట్టి వచ్చే బడ్జెట్‌లో ఈ మేరకు సున్నా వడ్డీ పథకానికి నిధులు కేటాయిస్తాం అని బుగ్గన చెప్పారు.

First Published:  13 July 2019 2:52 AM IST
Next Story