బ్లాక్ మార్కెట్లో ప్రపంచకప్ ఫైనల్ టికెట్లు
భారత అభిమానుల చేతిలోనే అత్యధిక టికెట్లు 16వేల పౌండ్లు పలుకుతున్న 295 పౌండ్ల టికెట్ ధర లార్డ్స్ వేదికగా ప్రపంచకప్ టైటిల్ సమరం క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే ప్రపంచకప్ టైటిల్ సమరానికి ఆతిథ్య ఇంగ్లండ్, గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సై అంటే సై అంటున్నాయి. అయితే…ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే… ఫైనల్ టికెట్ల ధరలు చుక్కలంటాయి. భారతజట్టు ఫైనల్ చేరడం ఖాయమని భావించిన భారత అభిమానులు భారీసంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారు. నిర్వాహక […]
- భారత అభిమానుల చేతిలోనే అత్యధిక టికెట్లు
- 16వేల పౌండ్లు పలుకుతున్న 295 పౌండ్ల టికెట్ ధర
- లార్డ్స్ వేదికగా ప్రపంచకప్ టైటిల్ సమరం
క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే ప్రపంచకప్ టైటిల్ సమరానికి ఆతిథ్య ఇంగ్లండ్, గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సై అంటే సై అంటున్నాయి.
అయితే…ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే… ఫైనల్ టికెట్ల ధరలు చుక్కలంటాయి. భారతజట్టు ఫైనల్ చేరడం ఖాయమని భావించిన భారత అభిమానులు భారీసంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారు.
నిర్వాహక సంఘం లెక్కల ప్రకారం 41 శాతం టికెట్లు భారత క్రికెట్ అభిమానుల చేతిలో ఉన్నాయి. మరో 45 శాతం టికెట్లు బ్రిటీష్ అభిమానులు కొనుగోలు చేశారు.
భారతజట్టు సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టడంతో…భారత అభిమానుల చేతిలో ఉన్న టికెట్లకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. ఒకవేళ ఫైనల్స్ కు హాజరు కాని భారత అభిమానులు తమ టికెట్లు విక్రయానికి ఉంచితే హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం ఖాయంగా కనిపిస్తోంది.
295 పౌండ్ల ధరకు కొన్న టికెట్ ను బ్లాక్ మార్కెట్లో ఇప్పటికే 16వేల పౌండ్ల ధరకు అమ్ముతున్నారు. దీంతో ఐసీసీ సైతం..బ్లాక్ లో టికెట్లు విక్రయించడంపై నిఘా ఉంచింది.
అవసరం అనుకొంటే టికెట్లను రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. టికెట్ ధరకు వందరెట్లు అధికధర చెల్లించి మ్యాచ్ చూడాల్సిన పనిలేదని.. ఫైనల్స్ ప్రత్యక్షప్రసారాన్ని ఉచితంగా అన్ని చానల్స్ కు ఇస్తున్నామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
30 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన లార్డ్స్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్స్ టికెట్లను ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ బ్రాండ్ల పేర్లతో
విక్రయించారు. ప్లాటినం టికెట్ ధర 395 పౌండ్లుగా ఉంటే…బ్రాంజ్ టికెట్ ధర 95 పౌండ్లుగా నిర్ణయించారు.