వింబుల్డన్లో నేడే మహిళల సింగిల్స్ ఫైట్
24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు సెరెనా తహతహ సిమోనా హాలెప్ తో సెరెనా టైటిల్ సమరం ప్రపంచ టెన్నిస్ అభిమానులను గత రెండువారాలుగా అలరిస్తూ వచ్చిన వింబుల్డన్ టెన్నిస్ సమరం క్లైయ్ మాక్స్ దశకు చేరింది. మహిళల సింగిల్స్ , పురుషుల సింగిల్స్ లో ఫైనల్స్ లైనప్ తేలిపోడంతో…టైటిల్ సమరానికి..ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే మహిళల టైటిల్ సమరంలో అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్, రుమేనియన్ […]
- 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు సెరెనా తహతహ
- సిమోనా హాలెప్ తో సెరెనా టైటిల్ సమరం
ప్రపంచ టెన్నిస్ అభిమానులను గత రెండువారాలుగా అలరిస్తూ వచ్చిన వింబుల్డన్ టెన్నిస్ సమరం క్లైయ్ మాక్స్ దశకు చేరింది.
మహిళల సింగిల్స్ , పురుషుల సింగిల్స్ లో ఫైనల్స్ లైనప్ తేలిపోడంతో…టైటిల్ సమరానికి..ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.
మరికొద్ది గంటల్లో జరిగే మహిళల టైటిల్ సమరంలో అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్, రుమేనియన్ వండర్ సిమోనా హాలెప్ అమీతుమీ తేల్చుకోనున్నారు.
24వ టైటిల్ కు సెరెనా రెడీ..
మహిళల గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో అత్యధిక టైటిల్స్ సాధించిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ మార్గారెట్ కోర్టు 24 టైటిల్స్ రికార్డును సమం
చేయటానికి వెటరన్ సెరెనా తహతహలాడుతోంది.
తన కెరియర్ లో ..11వసారి సెమీస్ చేరిన 11వ సీడ్ సెరెనా ఏకపక్షంగా సాగిన తొలిసెమీఫైనల్లో చెక్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవాను 6-1, 6-2తో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. సెరెనాకు ఏడుసార్లు వింబుల్డన్ టైటి్ల్ నెగ్గిన అనుభవం ఉంది.
ఫైనల్లో తొలిసారి సిమోనా హాలెప్ మరోవైపు …రుమేనియన్ వండర్ సిమోనా హాలెప్… 7వ సీడ్ గా టైటిల్ వేటకు దిగటమే కాదు… వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చేరిన తొలి రుమేనియన్ మహిళగా రికార్డుల్లో చోటు సంపాదించింది తొలి సెమీఫైనల్లో ఉక్రెయిన్ ప్లేయర్ ఎలెనా స్వితోలినాను వరుస సెట్లలో చిత్తు చేసిన హాలెప్ ఫైనల్లో సెరెనాతో ఢీ అంటే ఢీ అంటోంది.
గ్రాండ్ స్లామ్ ఫైనల్లో 5వసారి
27 ఏళ్ల హాలెప్ కు 2018లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రికార్డు ఉంది. అంతేకాదు తన కెరియర్ లో ఐదో గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో పోటీడనుంది.
టైటిల్ సమరంలో నెగ్గిన ప్లేయర్ కు వింబుల్డన్ ట్రోఫీతో పాటు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.