'నిను వీడని నీడను నేనే' సినిమా రివ్యూ
రివ్యూ: నిను వీడని నీడను నేనే రేటింగ్: 2.25/5 తారాగణం: సందీప్ కిషన్, అన్య సింగ్, మురళి శర్మ, ప్రగతి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు సంగీతం: ఎస్ ఎస్ థమన్ నిర్మాత: దయ పన్నెం, విజి సుబ్రహ్మణ్యం దర్శకత్వం: కార్తిక్ రాజు గత కొంత కాలంగా వరుస డిజాస్టర్ లతో సతమవుతున్న సందీప్ కిషన్ ఈ మధ్యనే విడుదలైన ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. తాజాగా ‘నిను వీడను నేనే’ […]
రివ్యూ: నిను వీడని నీడను నేనే
రేటింగ్: 2.25/5
తారాగణం: సందీప్ కిషన్, అన్య సింగ్, మురళి శర్మ, ప్రగతి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: ఎస్ ఎస్ థమన్
నిర్మాత: దయ పన్నెం, విజి సుబ్రహ్మణ్యం
దర్శకత్వం: కార్తిక్ రాజు
గత కొంత కాలంగా వరుస డిజాస్టర్ లతో సతమవుతున్న సందీప్ కిషన్ ఈ మధ్యనే విడుదలైన ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.
తాజాగా ‘నిను వీడను నేనే’ అనే సినిమాతో తన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్య సింగ్ హీరోయిన్ గా నటించింది. టీజర్ మరియు ట్రైలర్ తోనే సినిమాలోని కాన్సెప్ట్ చూపించి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం విడుదలైంది.
సందీప్ కిషన్ ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. మరి ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
సినిమా మొదలవ్వడమే 2035లో మొదలవుతుంది. ఒక సైకాలజీ ప్రొఫెసర్(మురళీ శర్మ) 2013 లో తన వద్దకు వచ్చిన ఒక కేసుకు సంబంధించిన విషయాలను చెబుతుంటారు. అప్పుడే కథ 2013 సంవత్సరానికి షిఫ్ట్ అవుతుంది. అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (ఆన్య సింగ్) భార్య భర్తలు. ఓ ఇంట్లో ఉంటున్న వీరికి ఓ యాక్సిడెంట్ తరువాత కొన్ని భయానక సంఘటనలు జరుగుతాయి. వారు అద్దంలో చూసుకున్నప్పుడల్లా వారికి బదులుగా వేరే వాళ్ళ (రిషీ, దియా) ముఖాలు కనిపిస్తుంటాయి. దీనికి కారణం ఏంటి.? అద్దంలో కనిపిస్తున్న రిషి, దియా ఎవరు? చివరకు ఏమైంది? అన్నదే సినిమా కథ.
సినిమాలో సందీప్ కిషన్ పాత్రలో బోలెడు షేడ్స్ ఉన్నప్పటికీ…. సందీప్ సినిమాలో అన్ని వేరియేషన్స్ ని చాలా చక్కగా పలికించాడు. తన నటనతో ప్రేక్షకుల దృష్టిని కొంతమేరకు ఆకర్షిస్తాడు సందీప్. తన మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో సందీప్ కి కష్టమైన పాత్ర అయినప్పటికీ, సందీప్ నటించాడు.
అన్య సింగ్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. తన అందం మరియు నటనతో కూడా అందరినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా సందీప్ తో తన కెమిస్ట్రీ చాలా చక్కగా వర్క్ ఔట్ అయింది. వెన్నెలకిశోర్ కి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. తన పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించాడు. రాహుల్ రామకృష్ణ కామెడీ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. ఎప్పటిలాగానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో పోసాని కృష్ణ మురళి ప్రేక్షకులను అలరిస్తారు. ప్రగతి ఈ సినిమాలో చాలా బాగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.
దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమా కోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నారు. అయితే హారర్ సన్నివేశాలు మాత్రం అంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయాయి. అద్దంలో సందీప్ కిషన్ కాకుండా వెన్నెల కిషోర్ కనిపిస్తుండటం వంటి ఆసక్తికరమైన కాన్సెప్టుతో ప్రేక్షకులను అలరించే విధంగా బాగానే నెరేట్ చేశారు.
నిర్మాతలు దయ పన్నెం, విజి సుబ్రహ్మణ్యం…. వెంకటాద్రి టాకీస్ పతాకంపై అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. పాటల సంగతి పక్కన పెడితే తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తుంది. పీకే వర్మ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆయన అందించిన విజువల్స్ సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయి. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.
బలాలు:
నటీనటులు, కామెడీ,నేపధ్య సంగీతం
బలహీనతలు:
కొన్ని సాగతీత సన్నివేశాలు, హారర్ సన్నివేశాలు ,లాజిక్ లేని సన్నివేశాలు
మిగతా హారర్ సినిమాలతో పోలిస్తే ‘నిను వీడని నీడను నేనే’ సినిమా కథ ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ మీద నడుస్తుంది. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెంచే విధంగా చాలా బాగా నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సినిమా పై మరింత ఆసక్తి కలిగిస్తుంది.
కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో మొదలయ్యే ఈ సినిమాలో కొన్ని హారర్ సన్నివేశాలను కూడా యాడ్ చేసి… మళ్లీ చివరికి సెంటిమెంట్ కోణం కూడా చూపించటం ప్రేక్షకులను కొంత నిరాశ పరుస్తుంది. మధ్యలో కామెడీ కూడా ఉండడంతో అసలు సినిమా ఏ జోనర్ కీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది. నటీనటులు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు గా చెప్పుకోవచ్చు.