'ఇస్మార్ట్ శంకర్' రొమాంటిక్ యాంగిల్....
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు రామ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం లో నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమధ్యే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లో మాస్ లుక్ లో కనిపించి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో […]
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు రామ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం లో నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమధ్యే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లో మాస్ లుక్ లో కనిపించి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు రామ్. తాజాగా ఈ సినిమా నుండి రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
ఇక ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ ట్రైలర్ వీడియోలో కేవలం ఇద్దరు హీరోయిన్లతో రామ్ రొమాంటిక్ సన్నివేశాలను మాత్రమే చూపించారు.
Usthaad Ismarrrrrrrt Shankar in Entertainment Mode…Reloaded #iSmartShankarTrailer2 https://t.co/VknHEytbGL@ramsayz @purijagan @Charmmeofficial @AgerwalNidhhi @NabhaNatesh @ActorSatyaDev #PCFilm @PuriConnects @IamVishuReddy#iSmartShankarOnJuly18th
— PURIJAGAN (@purijagan) July 12, 2019
ఇప్పటిదాకా మాస్ అవతారం లో కనిపించిన రామ్ కి ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. పూరి జగన్నాధ్ మరియు చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 18వ తేదీన విడుదల కాబోతుంది.