Telugu Global
NEWS

బాలకృష్ణ పీఏ శేఖర్‌కు జైలు శిక్ష

నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్‌కు జైలు శిక్ష పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల జరిమానాను నెల్లూరు ఏసీబీ కోర్టు విధించింది. శేఖర్ తిరుపతి పద్మావతి వర్శిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని 2008లో ఏసీబీ కేసు నమోదు అయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్‌ను బాలకృష్ణ ఏరికోరి పీఏగా నియమించుకున్నారు. ఆసమయంలోనూ హిందూపురం నియోజకవర్గంలో శేఖర్ చక్రం తిప్పారు. […]

బాలకృష్ణ పీఏ శేఖర్‌కు జైలు శిక్ష
X

నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్‌కు జైలు శిక్ష పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల జరిమానాను నెల్లూరు ఏసీబీ కోర్టు విధించింది.

శేఖర్ తిరుపతి పద్మావతి వర్శిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని 2008లో ఏసీబీ కేసు నమోదు అయింది.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్‌ను బాలకృష్ణ ఏరికోరి పీఏగా నియమించుకున్నారు. ఆసమయంలోనూ హిందూపురం నియోజకవర్గంలో శేఖర్ చక్రం తిప్పారు. భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలే అనేకసార్లు ఆరోపించారు.

ఒక దశలో పీఏను తొలగించాలంటూ నియోజకవర్గం టీడీపీనేతలు మూకుమ్మడిగా రహస్య సమావేశాలు నిర్వహించారు. దాంతో దిగి వచ్చిన బాలకృష్ణ శేఖర్‌ను పక్కనపెట్టారు. 2008లో నమోదైన కేసు విషయంలో నెల్లూరు ఏసీబీ కోర్టు ఇప్పుడు తీర్పు వెలువరించింది.

First Published:  13 July 2019 12:32 PM IST
Next Story