27 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్
రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల విజయం న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ టైటిల్ సమరం క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా సూపర్ సండే ఫైట్ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ కు ప్రపంచ నంబర్ వన్ టీమ్ ఇంగ్లండ్ అలవోకగా చేరుకొంది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ 8 వికెట్లతో చిత్తు చేసి…27 ఏళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఫైనల్స్ బెర్త్ సాధించింది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే […]
- రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల విజయం
- న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ టైటిల్ సమరం
- క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా సూపర్ సండే ఫైట్
వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ కు ప్రపంచ నంబర్ వన్ టీమ్ ఇంగ్లండ్ అలవోకగా చేరుకొంది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ 8 వికెట్లతో చిత్తు చేసి…27 ఏళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఫైనల్స్ బెర్త్ సాధించింది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్స్ లో గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ తలపడనుంది.
ఈ నాకౌట్ ఫైట్ లో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్, లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఆ తర్వాత 224 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు బెయిర్ స్టో, జేసన్ రాయ్ ..మొదటి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.
జేసన్ రాయ్ 85 పరుగుల స్కోరు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో జేసన్ కు ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
ఇంగ్లండ్ చివరకు 32.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 226 పరుగులతో విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
మొత్తం మీద ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న ఆస్ట్రేలియా ఆశలను ఇంగ్లండ్ అడియాసలు చేసింది.