Telugu Global
National

ఒత్తిడి లేకుంటే ముంబాయ్‌లో ఎందుకు దాక్కున్నారు?

ఒత్తిళ్ల మధ్య రాజీనామా చేయకపోతే కర్నాటకలోని సొంత నియోజక వర్గాల్లో ఉండాల్సిన ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని హోటళ్లలో ఎందుకు ఉన్నారని ఆ రాష్ట్ర స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ప్రశ్నించారు. బ్యాంకు పాస్‌ పుస్తకాల్లో డబ్బును చూసి పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని అందుకే ఇన్ని చెడుపోకడలు బయలుదేరాయన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాటిని గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను చట్టం ప్రకారమే నడుచుకుంటానన్నారు. రాజీనామాలో నిజాయితీ ఉందా లేదా అన్నది నిర్ధారించుకున్న తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. […]

ఒత్తిడి లేకుంటే ముంబాయ్‌లో ఎందుకు దాక్కున్నారు?
X

ఒత్తిళ్ల మధ్య రాజీనామా చేయకపోతే కర్నాటకలోని సొంత నియోజక వర్గాల్లో ఉండాల్సిన ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని హోటళ్లలో ఎందుకు ఉన్నారని ఆ రాష్ట్ర స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ప్రశ్నించారు.

బ్యాంకు పాస్‌ పుస్తకాల్లో డబ్బును చూసి పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని అందుకే ఇన్ని చెడుపోకడలు బయలుదేరాయన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాటిని గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను చట్టం ప్రకారమే నడుచుకుంటానన్నారు. రాజీనామాలో నిజాయితీ ఉందా లేదా అన్నది నిర్ధారించుకున్న తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానన్నారు.

ఎమ్మెల్యేలు ఇచ్చిన రాజీనామాలు సరైన ఫార్మెట్‌లో లేవన్నారు. అందుకే వాటిని తిరస్కరించి… ఒకవేళ మీరు నిజాయితీగా రాజీనామా చేయాలనుకుంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం రాజీనామాలు చేయాల్సిందిగా లేఖలు రాశానన్నారు.

రాజీనామాలను సరైన ఫార్మట్‌లో ఇచ్చిన ఐదుగురికి పలాన సమయంలో కలవాల్సిందిగా చెప్పానన్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి స్పీకర్ పారిపోయారంటూ ప్రచారం చేశారన్నారు.

నియోజకవర్గంలో ఉండి రాజీనామాలు ఇవ్వాల్సిన ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో వెళ్లి ముంబాయిలో దాక్కుని, అక్కడి నుంచి పోలీసుల భద్రత మధ్య వచ్చి రాజీనామా ఇస్తే అది సహజమైనదిగా ఎలా భావిస్తామని స్పీకర్ ప్రశ్నించారు.

స్పీకర్‌ పదవిలో ఉన్న తాను ఏ ఒక్క పార్టీ తరపున పనిచేసే వ్యక్తిని కాదన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుంటే ముంబాయికి వెళ్లి ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సరే వెధవలాగా తలూపి తాను రాజీనామాలను ఆమోదించాలా? అని నిలదీశారు స్పీకర్ రమేష్‌ కుమార్‌.

తాము ప్రస్తుతం బలహీనంగా ఉన్నామని బలవంతులు దాడి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.

First Published:  12 July 2019 12:00 PM GMT
Next Story