Telugu Global
NEWS

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ లో భారత కుర్రాడి రికార్డుల మోత

16 ఏళ్ల వయసులోనే లాల్ రినుంగా షో సమోవా వేదికగా జరుగుతున్న 2019 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 67 కిలోల విభాగంలో..భారత కుర్రాడు లాల్ రినుంగా రికార్డుల మోత మోగించాడు. కేవలం 16 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో తానేమిటో చాటుకొంటూ వస్తున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో జెర్మీ విఫలమైనా స్నాచ్ విభాగంలో మూడు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. స్నాచ్ విభాగంలో మొత్తం 136 కిలోల బరువెత్తి..మూడు రికార్డులను తిరగరాశాడు. ఈ […]

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ లో భారత కుర్రాడి రికార్డుల మోత
X
  • 16 ఏళ్ల వయసులోనే లాల్ రినుంగా షో

సమోవా వేదికగా జరుగుతున్న 2019 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 67 కిలోల విభాగంలో..భారత కుర్రాడు లాల్ రినుంగా రికార్డుల మోత మోగించాడు.

కేవలం 16 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో తానేమిటో చాటుకొంటూ వస్తున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో జెర్మీ విఫలమైనా స్నాచ్ విభాగంలో మూడు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు.

స్నాచ్ విభాగంలో మొత్తం 136 కిలోల బరువెత్తి..మూడు రికార్డులను తిరగరాశాడు. ఈ పోటీలలోని వివిధ విభాగాలలో భారత లిఫ్టర్లు నాలుగు బంగారు, రెండు రజత, ఓ కాంస్య పతకాలు సాధించడం విశేషం.

మహిళల 76 కిలోల విభాగంలో మన్ ప్రీత్ కౌర్ బంగారు పతకం సాధించింది.

First Published:  12 July 2019 12:30 AM GMT
Next Story