వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సిమోనా హాలెప్
వింబుల్డన్ ఫైనల్స్ చేరిన తొలి రుమేనియన్ మహిళ సెమీఫైనల్లో ఎలెనా పై అలవోక విజయం వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు…రుమేనియన్ థండర్ సిమోనా హాలెప్ చేరుకొంది. 7వ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన హాలెప్ తొలి సెమీఫైనల్లో ఉక్రెయిన్ ప్లేయర్ ఎలెనా స్వితోలినాను వరుస సెట్లలో చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో తొలిసెట్ ను 6-1తో సొంతం చేసుకొన్న హాలెప్ రెండో సెట్ ను 6-3తో నెగ్గి తన కెరియర్ లో తొలిసారిగా […]
- వింబుల్డన్ ఫైనల్స్ చేరిన తొలి రుమేనియన్ మహిళ
- సెమీఫైనల్లో ఎలెనా పై అలవోక విజయం
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు…రుమేనియన్ థండర్ సిమోనా హాలెప్ చేరుకొంది. 7వ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన హాలెప్ తొలి సెమీఫైనల్లో ఉక్రెయిన్ ప్లేయర్ ఎలెనా స్వితోలినాను వరుస సెట్లలో చిత్తు చేసింది.
ఏకపక్షంగా సాగిన ఈ పోరులో తొలిసెట్ ను 6-1తో సొంతం చేసుకొన్న హాలెప్ రెండో సెట్ ను 6-3తో నెగ్గి తన కెరియర్ లో తొలిసారిగా ఫైనల్లో చోటు సంపాదించింది.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చేరిన తొలి రుమేనియన్ మహిళగా రికార్డుల్లో చోటు సంపాదించింది.
2018లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సిమోనా హాలెప్…గ్రాండ్ స్లామ్ టోర్నీల ఫైనల్స్ చేరడం ఇది ఐదోసారి కావడం విశేషం.
ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్, చెక్ ప్లేయర్ బార్బరా స్ట్ర్రికోవాల మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో విజేతగా నిలిచిన వారితో 27 ఏళ్ల హాలెప్ తలపడుతుంది.