Telugu Global
Cinema & Entertainment

మెగాస్టార్ కోసం ఐశ్వర్యా రాయ్.... అమితాబ్ రికమండేషన్ పని చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే తన తదుపరి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం చిరంజీవి ప్రస్తుతం బరువు తగ్గే పనిలో పడ్డారు. మరోవైపు కొరటాల శివ ఈ సినిమా కోసం […]

మెగాస్టార్ కోసం ఐశ్వర్యా రాయ్.... అమితాబ్ రికమండేషన్ పని చేస్తుందా?
X

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే తన తదుపరి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో తన పాత్ర కోసం చిరంజీవి ప్రస్తుతం బరువు తగ్గే పనిలో పడ్డారు. మరోవైపు కొరటాల శివ ఈ సినిమా కోసం క్యాస్టింగ్ పనులను చూసుకుంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే అనుష్క, తమన్నా, నయనతార వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి… కానీ కొరటాల శివ ఈ సినిమా కోసం ఒక ఫ్రెష్ ఫేస్ తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో కొరటాల శివ చిరంజీవి సరసన నటించేందుకు బాలీవుడ్ భామ ఐశ్వర్యరాయ్ ని రంగంలోకి దింపాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం అందుతోంది.

ఐశ్వర్యారాయ్ ఇప్పటిదాకా డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించింది లేదు. మరి కొరటాల శివ మెగాస్టార్ కోసం ప్రపంచ సుందరి ని తీసుకు రాగలరా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఎలాగో ‘సైరా’ సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించారు. కనుక అమితాబ్ రికమండేషన్ తో ఐశ్వర్యా రాయ్ ఈ సినిమా కోసం ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

First Published:  11 July 2019 6:40 AM IST
Next Story