ఇద్దరు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్
ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి , సంతనూతలపాడు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకున్నారు. తమ గెలుపులో కీలక పాత్ర పోషించిన బూచేపల్లి శివప్రసాదరెడ్డిని అవమానించేలా వ్యవహరించడంతో జగన్ సీరియస్ అయినట్టు చెబుతున్నారు. దర్శి టికెట్ బూచేపల్లికి ఇచ్చేందుకు జగన్ సిద్ధపడినా బూచేపల్లి శివప్రసాద రెడ్డి పోటీకి విముఖత చూపారు. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్‌కు దర్శి టికెట్ ఇచ్చారు. వేణుగోపాల్ గెలుపుకు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఆయన వర్గం పూర్తి స్థాయిలో పనిచేశారు. సంతనూతలపాడు విషయంలోనూ బూచేపల్లి పనిచేశారు. సొంత […]
ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి , సంతనూతలపాడు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకున్నారు. తమ గెలుపులో కీలక పాత్ర పోషించిన బూచేపల్లి శివప్రసాదరెడ్డిని అవమానించేలా వ్యవహరించడంతో జగన్ సీరియస్ అయినట్టు చెబుతున్నారు.
దర్శి టికెట్ బూచేపల్లికి ఇచ్చేందుకు జగన్ సిద్ధపడినా బూచేపల్లి శివప్రసాద రెడ్డి పోటీకి విముఖత చూపారు. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్‌కు దర్శి టికెట్ ఇచ్చారు. వేణుగోపాల్ గెలుపుకు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఆయన వర్గం పూర్తి స్థాయిలో పనిచేశారు. సంతనూతలపాడు విషయంలోనూ బూచేపల్లి పనిచేశారు. సొంత డబ్బు కూడా ఖర్చు చేసి సుధాకర్ బాబు గెలుపుకు కృషి చేశారు.
అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డిని దూరంపెడుతూ వచ్చారు. వేణుగోపాల్ ఒక అడుగు ముందుకేసి బూచేపల్లి దగ్గర నుంచి సిఫార్సులు తీసుకురావాల్సిన అవసరం లేదు… ఏదైనా కావాలంటే నేరుగా తన వద్దకే రావాల్సిందిగా ఆదేశించినట్టు చెబుతున్నారు. దర్శి నియోజకవర్గంలో పోలీసు అధికారులు కూడా తాను చెప్పిన వారే ఉండాలన్నట్టు వ్యవహరించినట్టు చెబుతున్నారు.
సుధాకర్ బాబు కూడా సంతనూతలపాడులో బూచేపల్లి వర్గాన్ని దూరంపెడుతూ ఎమ్మెల్యే అనే దర్పాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు తన పట్ల ఇలా వ్యవహరించడాన్ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి బూచేపల్లి శివప్రసాదరెడ్డి తీసుకెళ్లారు.
దాంతో ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించుకుని జగన్ కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు ప్రచారం జరుగుతోంది. మీ గెలుపుకోసం పనిచేసిన వ్యక్తి పట్ల ఇదేనా మీరు చూపే కృతజ్ఞత అంటూ జగన్ వ్యాఖ్యానించారు. శివప్రసాదరెడ్డిని కలుపుకుని ముందుకెళ్లాల్సిందేనని స్పష్టంగా జగన్ చెప్పారు.