Telugu Global
NEWS

అధికారులను అడ్డంగా వాడుకునేవాడు.... ఆ తరువాత పార్టీ పదవులు ఇచ్చేవాడు

సమైక్య రాష్ట్రంలోను, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని పలు రాజకీయ పార్టీలకు చెందిన వక్తలు అభిప్రాయపడ్డారు. సీబీఐకి చిక్కిన ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీతో పాటు పలువురు రాజకీయ, ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా గోష్టిలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార […]

అధికారులను అడ్డంగా వాడుకునేవాడు.... ఆ తరువాత పార్టీ పదవులు ఇచ్చేవాడు
X

సమైక్య రాష్ట్రంలోను, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని పలు రాజకీయ పార్టీలకు చెందిన వక్తలు అభిప్రాయపడ్డారు.

సీబీఐకి చిక్కిన ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీతో పాటు పలువురు రాజకీయ, ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా గోష్టిలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడేనని, వారి ద్వారా పొందిన ప్రయోజనాల కోసం వారికి రాజకీయ అవకాశాలు ఇచ్చారని అన్నారు.

“సిబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావుకు శాసనసభ టిక్కెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత ఆయన్ని మంత్రి చేసింది కూడా ఆయనే” అని నాగరాజు అన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులను తనకు అనుకూలంగా పని చేయించుకునేందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా వారికి ఎన్నో ప్రయోజనాలు చేశారన్నారు.

సీబీఐ దాడుల్లో పట్టబడ్డ బొల్లినేని గాంధీ అక్రమ సేవలను సమైక్య రాష్ట్రంలోను, రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు దారుణంగా వాడుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగరాజు వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులనే కాదు… ఏసీబీ అధికారులను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నది చంద్రబాబు నాయుడేనని, అయితే, ఆయన చేసిన అక్రమాలను అడ్డుకునే వారు మాత్రం లేకుండా పోయారని ఆయన అన్నారు.

ఇక చర్చలో పాల్గొన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి మాట్లాడుతూ అధికారులను మేనేజ్ చేయడంలోను, ఎన్నికలను మేనేజ్ చేయడంలోనూ చంద్రబాబు నాయుడ్ని మించిన వారు లేరని తాను ముందు నుంచి చెబుతున్నానని అన్నారు. “చంద్రబాబు నాయుడు తన అనుంగు అనుచరులు సుజనాచౌదరి, సీఎం రమేష్ లను ఈ ప్రభుత్వ అధికారుల ద్వారానే రక్షించారు. ఇప్పుడు ఆ ఇద్దరిని అధికార భారతీయ జనతా పార్టీలో చేర్పించారు” అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఈ ఇద్దరు నాయకులను రక్షించింది చంద్రబాబు నాయుడేనని అందరికీ తెలుసునని, అయితే ఆయన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారని ఆమె అన్నారు.

First Published:  10 July 2019 5:26 AM IST
Next Story