వింబుల్డన్ లో సెరెనా 97వ గెలుపు
సెమీఫైనల్స్ చేరిన అమెరికన్ బ్లాక్ థండర్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ కు సెరెనా గురి అమెరికన్ బ్లాక్ థండర్, 11వ సీడ్ సెరెనా విలియమ్స్ …తన సుదీర్ఘ కెరియర్ లో 24వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ కు గురిపెట్టింది. 2019 వింబుల్డన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ చేరింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సెరెనా తన దేశానికే చెందిన అన్ సీడెడ్ ప్లేయర్ అలీసన్ రిస్కీని మూడుసెట్ల పోరులో అధిగమించింది. వెటరన్ […]
- సెమీఫైనల్స్ చేరిన అమెరికన్ బ్లాక్ థండర్
- 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ కు సెరెనా గురి
అమెరికన్ బ్లాక్ థండర్, 11వ సీడ్ సెరెనా విలియమ్స్ …తన సుదీర్ఘ కెరియర్ లో 24వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ కు గురిపెట్టింది. 2019 వింబుల్డన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ చేరింది.
ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సెరెనా తన దేశానికే చెందిన అన్ సీడెడ్ ప్లేయర్ అలీసన్ రిస్కీని మూడుసెట్ల పోరులో అధిగమించింది.
వెటరన్ సెరెనా 6-4, 4-6, 6-3తో రిస్కీపై విజయం సాధించింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో సెరెనాకు ఇది 97వ విజయం కావడం విశేషం.
వింబుల్డన్ లో అత్యధికంగా 120 విజయాలు సాధించిన రికార్డు మార్టినా నవ్రతిలోవా పేరుతో ఉంది. మార్టీనా తరువాత అత్యధిక విజయాలు సాధించిన మహిళగా సెరెనా నిలిచింది.
ఫైనల్లో చోటు కోసం జరిగే సమరంలో చెక్ అన్ సీడెడ్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవాతో సెరెనా తలపడుతుంది. సెమీస్ చేరిన ఇతర సీడెడ్ స్టార్లలో సిమోనా హాలెప్, బార్బరా స్ట్రికోవా సైతం ఉన్నారు.