Telugu Global
NEWS

భారత్- న్యూజిలాండ్ సెమీస్ నేడు

రిజర్వ్ డే నాడు మ్యాచ్ కొనసాగింపు  మ్యాచ్ రద్దయితే ఫైనల్లో భారత్ భారత్-న్యూజిలాండ్ జట్ల తొలి సెమీఫైనల్ మ్యాచ్ కు వానదెబ్బ గట్టిగానే తగిలింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగియకుండానే…46.1 ఓవర్ల ఆటతోనే నిలిచిపోడంతో..నిబంధనల ప్రకారం మ్యాచ్ ను నేడు కొనసాగించనున్నారు. బ్యాట్స్ మన్ స్వర్గధామం మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో…కీలక టాస్ ఓడినా.. భారత బౌలర్లు అద్భుతంగా బౌల్ చేసి కివీలను కట్టడి […]

భారత్- న్యూజిలాండ్ సెమీస్ నేడు
X
  • రిజర్వ్ డే నాడు మ్యాచ్ కొనసాగింపు
  • మ్యాచ్ రద్దయితే ఫైనల్లో భారత్

భారత్-న్యూజిలాండ్ జట్ల తొలి సెమీఫైనల్ మ్యాచ్ కు వానదెబ్బ గట్టిగానే తగిలింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగియకుండానే…46.1 ఓవర్ల ఆటతోనే నిలిచిపోడంతో..నిబంధనల ప్రకారం మ్యాచ్ ను
నేడు కొనసాగించనున్నారు.

బ్యాట్స్ మన్ స్వర్గధామం మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో…కీలక టాస్ ఓడినా..
భారత బౌలర్లు అద్భుతంగా బౌల్ చేసి కివీలను కట్టడి చేశారు.

కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, మాజీ కెప్టెన్ రోజ్ టేలర్ ఫైటింగ్ హాఫ్ సెంచరీలు సాధించి తమజట్టును ఆదుకోడంతో..వానతో మ్యాచ్
నిలిపి వేసే సమయానికి 5 వికెట్లకు 211 పరుగులు మాత్రమే చేయగలిగింది.

విలియమ్స్ సన్ 95 బాల్స్ లో 67, రోజ్ టేలర్ 85 బాల్స్ లో 67 పరుగులు సాధించడం విశేషం.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా, పాండ్యా, జడేజా, చహాల్ తలో వికెట్ పడగొట్టారు.

యధావిథింగా మ్యాచ్ కొనసాగింపు..

సెమీస్ తొలిరోజున మ్యాచ్ నిలిచిపోయిన సమయానికి ఉన్న స్కోరుతోనే రిజర్వ్ డే ( బుధవారం )నాడు మ్యాచ్ ను కొనసాగించనున్నారు.

ఒకవేళ నేడు సైతం వర్షం దెబ్బతో మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోతే…లీగ్ టేబుల్ టాపర్ భారత్ ను ఫైనల్స్ చేరినట్లు ప్రకటిస్తారు.

మ్యాచ్ కొనసాగినా…భారతజట్టుకే విజయావకాశాలు ఉన్నాయి.

ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ రెండుజట్లు ఆడిన ముఖాముఖీ మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ దే 4-3తో పైచేయిగా ఉంది.

ఓవరాల్ గా రెండుజట్లూ 100 వన్డేల్లో ఢీ కొంటే భారత్ 50, న్యూజిలాండ్ 45 విజయాల రికార్డు తో ఉన్నాయి.

First Published:  10 July 2019 1:42 AM IST
Next Story