రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.... కీలకమైన 12 బిల్లులు
ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం కోసం శాసనసభ సమావేశమైంది. ఆ సభలోనే స్పీకర్ ఎంపికను కూడా చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి గురువారం నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశం అవుతాయి. ఈ సమావేశాల్లో శుక్రవారం నాడు […]
ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం కోసం శాసనసభ సమావేశమైంది. ఆ సభలోనే స్పీకర్ ఎంపికను కూడా చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి గురువారం నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశం అవుతాయి. ఈ సమావేశాల్లో శుక్రవారం నాడు అంటే 12 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి.
అనంతరం సోమవారం నుంచి బడ్జెట్ పై చర్చ, ఇతర అంశాలపై కూడా శాసనసభ చర్చిస్తుంది. ఈ సభలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కీలకమైన 12 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతోను, న్యాయ నిపుణులతోను సుదీర్ఘంగా చర్చించారు. సభలో అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఉండడంతో సభలో ప్రవేశ పెట్టే బిల్లులన్నీంటికీ ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. అయితే, ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బలం ఉంది కదా అని శాసనసభలో ఆధిక్యంతో ప్రవర్తించరాదని, ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో కీలకమైన 12 బిల్లులు ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. అందులో ముఖ్యమైనది వివిధ ప్రాజెక్టులకు సంబంధించి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు, టెండర్ల రీకాల్ వంటి కీలక బిల్లులున్నాయి. అలాగే రాష్ట్ర్రంలో రెచ్చిపోతున్న ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలలను నియంత్రించేందుకు కూడా మరో కీలక బిల్లును సభలో ప్రవేశ పెడతారు. రాష్ట్రంలో భూముల రీసర్వేతో పాటు శాశ్వత హక్కు కల్పించే బిల్లును ఈ సభలో ప్రవేశపెడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక నామినేటెడ్, ప్రభుత్వ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్సించే కీలక బిల్లు కూడా తొలి శాసనసభ ముందుకు రానుంది. ఇది ఆయా వర్గాలకు ఎంతో మేలు చేయనుంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం, ఏపీఐడీఏ 2001 చట్టాన్ని సవరించడం వంటి కీలక బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి.